1991 భారత సార్వత్రిక ఎన్నికలు

భారతదేశంలో 10 వ లోక్‌సభ సభ్యులను ఎన్నుకునేందుకు జరిగిన ఎన్నికలు From Wikipedia, the free encyclopedia

1991 భారత సార్వత్రిక ఎన్నికలు
Remove ads

భారతదేశంలో 10వ లోక్‌సభ సభ్యులను ఎన్నుకోవడానికి 1991 మే 20, జూన్ 12, జూన్ 15 తేదీల్లో భారతదేశంలో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి, పంజాబ్‌లో మాత్రం 1992 ఫిబ్రవరి 19 న జరిగాయి.

త్వరిత వాస్తవాలు 543 కి గాను 534 స్థానాలకు 268 seats needed for a majority, నమోదు ఓటర్లు ...

లోక్‌సభలో ఏ పార్టీ కూడా పూర్తి మెజారిటీ సాధించలేకపోయింది. ఫలితంగా భారత జాతీయ కాంగ్రెస్ (ఇందిర), ఇతర పార్టీల మద్దతుతో కొత్త ప్రధాని పివి నరసింహారావు ఆధ్వర్యంలో మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. జనతాదళ్, జార్ఖండ్ ముక్తి మోర్చా ల నుండి చేస్యించిన ఫిరాయింపుల కారణంగా వివాదాస్పద పరిస్థితుల్లో ప్రభుత్వం 1993 జూలై 28 న అవిశ్వాస తీర్మానం నుండి బయటపడింది.[2][3]

జమ్మూ కాశ్మీర్‌కు కేటాయించిన ఆరు స్థానాలకు, బీహార్‌లో రెండు, ఉత్తరప్రదేశ్‌లోని ఒక స్థానానికి కూడా ఎన్నికలు జరగలేదు. ఓటింగ్ శాతం 57%గా నమోదైంది. ఇది, అప్పటి వరకు భారత సార్వత్రిక ఎన్నికల్లో జరిగిన అతి తక్కువ వోటింగు.[4]

Remove ads

నేపథ్యం

అధికారంలో ఉన్న చంద్రశేఖర్ ప్రభుత్వం, ఏర్పడిన 16 నెలలకే రద్దు అవడంతో, 1991 ఎన్నికలు జరిగాయి. దాని 50 కోట్లకు పైగా ఉన్న ఓటర్లకు మరోసారి తమ ప్రభుత్వాన్ని ఎన్నుకునే అవకాశం లభించింది.[5] ఎన్నికలు భిన్నధ్రువాలుగా విడిపోయిన జరిగాయి. రెండు ముఖ్యమైన ఎన్నికల సమస్యలైన మండల్ కమిషన్ పర్యవసానాలు, రామజన్మభూమి-బాబ్రీ మసీదు సమస్యల నేపథ్యంలో జరిగిన ఈ ఎన్నికలను 'మండల్-మందిర్' ఎన్నికలు అని కూడా పిలుస్తారు.

మండల్-మందిర్ సమస్య

VP సింగ్ ప్రభుత్వం అమలు చేసిన మండల్ కమీషన్ నివేదిక ప్రభుత్వ ఉద్యోగాలలో ఇతర వెనుకబడిన కులాల (OBC)లకు 27 శాతం రిజర్వేషన్లు కల్పించింది. ఇది దేశవ్యాప్తంగా షెడ్యూల్డ్ కులాల ప్రజల నుండి విస్తృతమైన హింసకు, నిరసనలకూ దారితీసింది. ఢిల్లీ, పరిసర ప్రాంతాలలో అనేక మంది విద్యార్థులు తమకు తాము నిప్పంటించుకున్నారు కూడా. అయోధ్యలోని వివాదాస్పద బాబ్రీ మసీదుపై జరుగుతున్న వివాదం కారణంగా అది కూడా ఈ ఎన్నికలకు మరో ప్రధానాంశం. ఇది భారతీయ జనతా పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రధానాంశం.

మందిర సమస్య దేశంలోని అనేక ప్రాంతాలలో అనేక అల్లర్లకు దారితీసింది. ఓటర్లు కుల, మత ప్రాతిపదికన విభజించబడ్డారు. నేషనల్ ఫ్రంట్ విడిపోవడంతో, కాంగ్రెస్(ఐ) అత్యధిక స్థానాలు సాధించి, మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ఈ విభజనను అత్యధికంగా ఉపయోగించుకోగలిగింది.[6]

రాజీవ్ గాంధీ హత్య

మే 20 న మొదటి రౌండ్ పోలింగ్ జరిగిన ఒక రోజు తర్వాత, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ శ్రీపెరంబుదూర్‌లో మరగతం చంద్రశేఖర్ తరపున ప్రచారం చేస్తూ హత్యకు గురయ్యాడు. మిగిలిన ఎన్నికలను జూన్ మధ్య వరకు వాయిదా వేసారు. చివరకు జూన్ 12, 15 తేదీల్లో ఓటింగు జరిగింది.

మొత్తం ఎన్నికలు జరగాల్సిన 534 నియోజకవర్గాలకు గాను, 211 నియోజకవర్గాలలో మొదటి దశ పోలింగు జరిగిన తర్వాత హత్య జరిగింది. హత్య జరిగిన తర్వాత మిగిలిన నియోజకవర్గాలు ఎన్నికలకు వెళ్ళినందున, ఈ రెండు దశల ఎన్నికల ఫలితాలలో బాగా తేడా వచ్చింది.[7] మొదటి దశలో కాంగ్రెస్ (ఐ) దాదాపు తుడిచిపెట్టుకుపోయింది. రెండవ దశలో భారీ సానుభూతి తరంగం కారణంగా భారీగా విజయాలు సాధించింది.[5] గతంలో రాజకీయాల నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన పి.వి.నరసింహారావు నేతృత్వంలో, జనతాదళ్ మద్దతుతో కాంగ్రెస్ (ఐ) నేతృత్వంలోని మైనారిటీ ప్రభుత్వం ఏర్పడింది. రావు ఈ ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఆ తరువాత నంద్యాలలో జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ చేసి రికార్డు స్థాయిలో ఐదు లక్షల ఓట్లతో గెలుపొందాడు.

వేర్పాటువాద హింసతో అట్టుడుకుతున్న పంజాబ్‌లో ముష్కరులు చేసిన రెండు దాడుల్లో 1991 జూన్ 17 న ప్రచారంలో 76 నుండి 126 మంది కాల్చి చంపబడ్డారు. సిక్కు తీవ్రవాదులు వేరువేరు రైళ్లలో ఈ హత్యలు చేశారని పోలీసు నివేదికలు తెలిపాయి.[8] జమ్మూ కాశ్మీర్, పంజాబ్‌ లలో మొత్తం 19 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగలేదు.[9] పంజాబ్‌లో 1992 ఫిబ్రవరి 19 న ఎన్నికలు జరిగాయి,[10] ఇక్కడ కాంగ్రెస్ 13 స్థానాలకు గాను 12 ను గెలుచుకుంది,[11] తద్వారా లోక్‌సభలో వారి సంఖ్య 232 నుండి 244కి పెరిగింది.

Remove ads

ఫలితాలు

మరింత సమాచారం Party, Votes ...

పంజాబ్‌లో

మరింత సమాచారం Party, Votes ...
Remove ads

అనంతర పరిణామాలు

కాంగ్రెస్ (ఐ) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి వచ్చింది. మీడియాలో ప్రధానమంత్రిగా ప్రస్తావనకు వచ్చిన వ్యక్తులు:[12]

వివాదాస్పద పరిస్థితుల్లో జనతాదళ్ నుండి బయటి మద్దతు పొంది, పివి నరసింహారావు ప్రధానమంత్రిగా కాంగ్రెస్(ఐ) పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. లాల్ బహదూర్ శాస్త్రి తరువాత, నెహ్రూ-గాంధీ కుటుంబేతరుడు ప్రధాని అయిన రెండవ కాంగ్రెస్ నాయకుడు నరసింహారావు. 5 సంవత్సరాల పదవీకాలాన్ని పూర్తి చేసిన మైనారిటీ ప్రభుత్వానికి నాయకత్వం వహించిన మొదటి కాంగ్రెస్ ప్రధానమంత్రి కూడా అతనే.[14]

ఇవి కూడా చూడండి

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.

Remove ads