రాజీవ్ లోంగోవాల్ ఒప్పందం
ప్రధాని రాజీవ్ గాంధీ, సంత్ హర్‌చంద్ సింగ్ లోంగోవాల్‌ల ఒప్పందం From Wikipedia, the free encyclopedia
Remove ads
రాజీవ్-లోంగోవాల్ ఒప్పందం 1985 జూలై 24 న భారత ప్రధాని రాజీవ్ గాంధీ, అకాలీ నాయకుడు సంత్ హర్‌చంద్ సింగ్ లోంగోవాల్‌లు సంతకం చేసిన ఒప్పందం. శిరోమణి అకాలీదళ్, తాను చేసిన డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించడంతో, ఆందోళనను విరమించుకోవడానికి అంగీకరించింది.
పంజాబ్‌లోని పలువురు సనాతన సిక్కు నాయకులు, అలాగే హర్యానా రాజకీయ నాయకులూ ఈ ఒప్పందాన్ని వ్యతిరేకించారు. భిన్నాభిప్రాయాల కారణంగా దాని వాగ్దానాలు కొన్ని నెరవేరలేదు. ఒప్పందాన్ని వ్యతిరేకించిన సిక్కు తీవ్రవాదులు లోంగోవాల్‌ను హత్య చేశారు.[1]
Remove ads
నిబంధనలు
ఈ ఒప్పందంలోని నిబంధనలు ఇలా ఉన్నాయి:[2] : 108
Remove ads
వ్యతిరేకత
పంజాబ్
జూలై 26న, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, జతేదార్‌ల సంఘం ఈ ఒప్పందాన్ని ఏకగ్రీవంగా ఆమోదించిందని లోంగోవాల్ ప్రకటించాడు. అయితే, గురుచరణ్ సింగ్ తోహ్రా (SGPC అధ్యక్షుడు), ప్రకాష్ సింగ్ బాదల్‌లు ఒప్పందంలోని ప్రతి నిబంధననూ వ్యతిరేకించారు.[2] : 122 లోంగోవాల్, తోహ్రా, బాదల్, సుర్జిత్ సింగ్ బర్నాలాల మధ్య సమావేశం జరిగిన తర్వాత కూడా విభేదాలు కొనసాగాయి. జూలై 25 న అకాలీదళ్ నాయకుల బృందం ఈ ఒప్పందాన్ని తిరస్కరించింది. దాన్ని "అమ్ముడు పోవటం" అని వర్ణించింది. జర్నైల్ సింగ్ భింద్రన్‌వాలే తండ్రి జోగీందర్ సింగ్, అకాలీ దాలి సమావేశానికి అధ్యక్షత వహిస్తూ, లోంగోవాల్, బర్నాలా, బల్వంత్ సింగ్‌లను సిక్కు పంత్‌కు ద్రోహులుగా అభివర్ణించాడు. సమావేశంలో ఆమోదించిన తీర్మానంలో ఆ నాయకులు సిక్కు ప్రజానీకానికి ప్రాతినిధ్యం వహించడం లేదని, ఆనంద్‌పూర్ సాహిబ్ తీర్మానాన్ని లోంగోవాల్ పలుచన చేశాడనీ ఆరోపించారు.[2] : 123
హర్యానా
హర్యానా ముఖ్యమంత్రి భజన్ లాల్, HPCC (I) అధ్యక్షుడు సుల్తాన్ సింగ్ ఈ ఒప్పందానికి ఆమోదం తెలిపారు. అయితే, హర్యానాలోని ఐదు ప్రతిపక్ష పార్టీలు - లోక్‌దళ్, బిజెపి, జనతా పార్టీ, కాంగ్రెస్ (ఎస్), కాంగ్రెస్ (జె) - ఒప్పందానికి నిరసనగా జూలై 31 న హర్యానా బంద్ పాటించనున్నట్లు ప్రకటించాయి. రోహ్‌తక్‌లో ర్యాలీ తర్వాత, హర్యానా రాష్ట్ర అసెంబ్లీకి చెందిన 29 మంది సభ్యులు ఆగస్టు 9 న రాజీనామా చేశారు. నిరసనకారులు ఈ క్రింది వాటిని వ్యతిరేకించారు: [2] : 124
- పంజాబ్‌లో సమస్యకు మూలకారణమైన ఆనంద్‌పూర్ సాహిబ్ తీర్మానాన్ని పరిగణించడాన్ని నిరసనకారులు విమర్శించారు.
- సైన్యాన్ని విడిచిపెట్టిన వారితో సున్నితంగా వ్యవహరించడం
- చండీగఢ్‌కు బదులుగా హర్యానాకు బదిలీ చేయబడే భూభాగాలకు సంబంధించి "అస్పష్టమైన" పరిష్కారం
- ప్రస్తుత వినియోగం ప్రకారం రావి-బియాస్ జలాల వినియోగంపై సీలింగ్ విధించడం: పంజాబ్ తనకు కేటాయించిన వాటా కంటే ఎక్కువ నీటిని ఉపయోగిస్తోందని, అయితే హర్యానా తన వాటా కంటే తక్కువ నీటిని ఉపయోగిస్తోందని నిరసనకారులు ఎత్తి చూపారు.
- హెడ్‌వర్క్‌లను ఎవరు నియంత్రిస్తారనే దానిపై అనిశ్చితి
Remove ads
ఇవి కూడా చూడండి
- ఇందిరా-షేక్ ఒప్పందం
మూలాలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads