![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/e/e5/Kushanmap.jpg/640px-Kushanmap.jpg&w=640&q=50)
కుషాణులు
From Wikipedia, the free encyclopedia
కుషాణు సామ్రాజ్యం సా.శ. 1వ శతాబ్దం - 3వ శతాబ్దం మధ్య కాలంలో విలసిల్లింది. దాని ప్రాభవ కాలంలో, సుమారు సా.శ.250 నాటికి, ఆ సామ్రాజ్యం ప్రస్తుత తజికిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ప్రాంతాలనుండి ఉత్తర భారతదేశంలోని గంగానది పరీవాహక ప్రాంతమంతా విస్తరించింది. ఈ సామ్రాజ్యం పాలకులు మొదట యూజీ అనే ఇండో-యూరోపియన్ తెగకు చెందిన పశ్చిమచైనా ప్రాంతంవారు.[2] కుషాణులకు రోమన్ సామ్రాజ్యంతోను, పర్షియా సస్సానిద్ సామ్రాజ్యంతోను, చైనాతోను రాజకీయ సంబంధాలుండేవి. తూర్పు, పశ్చిమ భూముల మధ్య సాస్కృతిక, ఆర్థిక, రాజకీయ మేళవింపులకు కుషాన్ సామ్రాజ్యం ఒక ముఖ్యమైన కేంద్రం అయ్యింది.
త్వరిత వాస్తవాలు భాషలు, మతాలు ...
![]() రబటక్ శాసనం ప్రకారం కనిష్కుని కాలంలో కుషాణుల పాలనలో ఉన్న ప్రాంతం (గీత లోపల), వారి అధిపత్య ప్రభావంలో ఉన్న ప్రాంతాలు (చుక్కల గీత లోపల) [1] | |
భాషలు | బాక్ట్రియన్, గ్రీక్, పాళి, సంస్కృతం, ప్రాకృతం, బహుశా అరామిక్ కూడా |
---|---|
మతాలు | మధ్య ఆసియా విధానాలు, జోరాస్ట్రియన్, బౌద్ధం పురాతన గ్రీక్ మతం, హిందూమతం |
రాజధాని నగరాలు | బెగ్రామ్, తక్షశిల, మధుర |
ప్రదేశం | మధ్య ఆసియా, భారత ఉపఖండం వాయవ్య ప్రాంతం |
కాలం | సా.శ.60 – 375 |
మూసివేయి