తెలంగాణ ముఖ్యమంత్రుల జాబితా
వికీమీడియా జాబితా కథనం / From Wikipedia, the free encyclopedia
భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర ముఖ్యమంత్రిని గవర్నరు నియమిస్తారు. రాజ్యాంగం ప్రకారం గవర్నరు రాష్ట్ర పరిపాలకుడు అయినప్పటికి అతనికి ఎటువంటి పరిపాలనాధికారాలు ఉండవు. శాసనసభ ఎన్నికలు ఫలితాలను బట్టి సరిపడా సంఖ్యాబలం ఉన్న పార్టీ లేదా కూటమిని గవర్నరు ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తారు.అతను ముఖ్యమంత్రిని నియమిస్తారు. ముఖ్యమంత్రి నేతృత్వంలో మంత్రి మండలి రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది. ముఖ్యమంత్రి పదవి కాలం ఐదు సంవత్సరాలు. ఈ పదవిని నిర్వహించడానికి ఎటువంటి సంఖ్యా పరిమితి లేదు. ఒక వ్యక్తి ఈ పదవిని ఎన్ని సార్లైనా చేపట్టవచ్చు.
త్వరిత వాస్తవాలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, విధం ...
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి | |
---|---|
విధం | గౌరవనీయులైన |
అధికారిక నివాసం | పూలే ప్రజా భవన్ గ్రీన్ ల్యాండ్స్ రోడ్డు, పంజాగుట్ట హైదరాబాద్ 500 082 తెలంగాణ, భారతదేశం |
నియామకం | తెలంగాణ రాష్ట్ర గవర్నరు |
మూసివేయి
2014 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో గెలుపొందిన కె.చంద్రశేఖరరావు 2014 జూన్ 2న రాష్ట్రం ఏర్పడిన తరువాత తెలంగాణ రాష్ట్రానికి ప్రారంభపు ముఖ్యమంత్రిగా పనిచేసాడు.[1]