కల్వకుంట్ల చంద్రశేఖరరావు
రాజకీయ నాయకుడు, తెలంగాణ ముఖ్యమంత్రి / From Wikipedia, the free encyclopedia
కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (జ.1954 ఫిబ్రవరి 17) తెలంగాణకు చెందిన రాజకీయ నాయకుడు, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నేత, భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్ పార్టీ) వ్యవస్థాపక అధ్యక్షుడు.[2] కేసీఆర్ అన్న పొడి అక్షరాలతో సుప్రసిద్ధుడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యాడు.[3][4][5] తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షుడైన చంద్రశేఖర్ రావు 14వ లోక్సభలో ఆంధ్రప్రదేశ్ లోని కరీంనగర్ లోక్సభ నియోజకవర్గంకు ప్రాతినిధ్యం వహించాడు. 2004 నుండి 2006 వరకు కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశాడు. 15వ లోక్సభలో మహబూబ్నగర్ నియోజకవర్గం నుండి విజయం సాధించాడు.[6] 2018 డిసెంబరు 7న జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించి, డిసెంబరు 13 గురువారం మధ్యాహ్నం 1:25 నిమిషాలకు రాజ్ భవన్లో కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండవసారి పదవీబాధ్యతలు చేపట్టాడు.[7]
కల్వకుంట్ల చంద్రశేఖరరావు | |||
కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు | |||
1వ ముఖ్యమంత్రి | |||
---|---|---|---|
పదవీ కాలం 2014 జూన్ 02 – 2023 డిసెంబర్ 03[1] | |||
తరువాత | ఎనుముల రేవంత్ రెడ్డి | ||
నియోజకవర్గం | గజ్వేల్ శాసనసభ నియోజకవర్గం | ||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | (1954-02-17) 1954 ఫిబ్రవరి 17 (వయసు 70) చింతమడక, మెదక్, తెలంగాణ | ||
రాజకీయ పార్టీ | భారత్ రాష్ట్ర సమితి | ||
జీవిత భాగస్వామి | శోభ | ||
సంతానం | కల్వకుంట్ల తారక రామారావు (కొడుకు), కల్వకుంట్ల కవిత (కూతురు) | ||
నివాసం | ప్రగతి భవన్, హైదరాబాదు | ||
మతం | హిందూమతం | ||
http://www.archive.india.gov.in/govt/loksabhampbiodata.php?mpcode=4083 |
తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేక రాష్ట్రం సాధనే ధ్యేయంగా తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని స్థాపించాడు. 2004 సంవత్సరంలో జరిగిన ఎన్నికలలో భారత జాతీయ కాంగ్రెస్తో కలిసి పోటీచేసి 5 లోక్సభ స్థానాలను దక్కించుకున్నాడు. అయితే తరువాతి కాలంలో యు.పి.ఎ నుండి వైదొలగాడు. ఇతడు ఎం.ఏ (సాహిత్యం) ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి పూర్తిచేశాడు. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సిద్దిపేట శాసనసభ నియోజకవర్గంనుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గజ్వేల్ శాసనసభ నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మొత్తం ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై రికార్డు సృష్టించారు. తెలంగాణ రాష్ట్ర రాజకీయంలో ముఖ్యపాత్ర పోషించారు.
2014 జూన్ 2 నుండి 2023 జూన్ 2 వరకు తొమ్మిది సంవత్సరాలపాటు తెలంగాణ రాష్ర్టానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, స్వాతంత్య్రానికి పూర్వం నుండి 2023 వరకు అత్యధికకాలం ముఖ్యమంత్రిగా కొలువుదీరిన తెలుగు నాయకుడిగా రికార్డు సృష్టించాడు. ఒక తెలుగు నాయకుడు గ్యాప్ లేకుండా, ఏకబిగిన, ఇంత సుదీర్ఘ కాలం, ఒక రాష్ర్టానికి ముఖ్యమంత్రిగా ఉండటం చరిత్రలో ఇదే మొట్టమొదటిసారి.[8]