న్యాయస్థానం
From Wikipedia, the free encyclopedia
న్యాయస్థానం (ఆంగ్లం: Court) పక్షాల మధ్య వివాదాలను చర్చించి న్యాయం (Justice) చెప్పే ప్రదేశం. ఇవి చాలా వరకు ప్రభుత్వానికి చెందినవిగా ఉంటాయి. ఈ వివాదాలు సివిల్, క్రిమినల్ లేదా అడ్మినిస్ట్రేషన్ కు సంబంధించినవిగా ఉండవచ్చును.[1] ఇవి ఆయా ప్రాంతాలకు లేదా దేశాలకు చెందిన న్యాయశాస్త్ర విధానాల్ని పాటిస్తాయి. ప్రాథమిక హక్కులను పరిరక్షించే బాధ్యత కూడా న్యాయస్థానాలు చేపడతాయి. ఒక న్యాయస్థానములో ఒకరు లేదా కొందరు న్యాయమూర్తులు (Judges) కలిసికట్టుగా తీర్పు (Judgement) చెప్తారు. వివిధ పక్షాల తరపున న్యాయవాదులు (Lawyers) వారి వారి వాదనలు (Arguments) వినిపిస్తారు.