![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/te/thumb/b/b4/BNR.jpeg/640px-BNR.jpeg&w=640&q=50)
భీమవరపు నరసింహారావు
From Wikipedia, the free encyclopedia
భీమవరపు నరసింహరావు (జనవరి 24, 1905 - సెప్టెంబర్ 7, 1976) తెలుగు సినిమా సంగీత దర్శకులు. ఈయన బి.ఎన్.ఆర్.గా అందరికి సుపరిచితుడు. ఈయన 8 సంత్సరాల వయసులోనే సంగీత కళ మొగ్గ తొడగడం మొదలైంది. ఈయనకు నాటకాల్లో నటించడం అన్నా, పాటలు పాడటం అన్నా చాలా మక్కువ. ఇతను ఏ గురుశుశ్రూష చేయలేదు. హార్మోనియం కూడా తనే స్వయంగా నేర్చుకొని అందులో ప్రావీణ్యం సంపాదించగలిగాడు. తెనాలిలోని శ్రీరామ విలాస సభ నాటకసంస్థలోసంగీత దర్శకుడిగా పనిచేశాడు.[1]ఈయన ధూమపాన ప్రియుడు. కేవలం సిగరెట్ల సంపాదన కోసం హార్మోనిస్ట్ గా థియేటర్ లో పనిచేయడం మొదలుపెట్టాడు.[ఆధారం చూపాలి]
త్వరిత వాస్తవాలు భీమవరపు నరసింహారావు, జననం ...
భీమవరపు నరసింహారావు | |
---|---|
![]() | |
జననం | జనవరి 24, 1905 కొలకలూరు, గుంటూరు జిల్లా |
మరణం | సెప్టెంబర్ 7, 1976 |
వృత్తి | సంగీత దర్శకుడు |
పిల్లలు | ఇద్దరు; కొడుకు, కూతురు |
తండ్రి | పుండరీకాక్ష శర్మ |
తల్లి | కోటమ్మ |
మూసివేయి