From Wikipedia, the free encyclopedia
మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎమ్‌సిజి), ఆస్ట్రేలియా, విక్టోరియా రాష్ట్రం,మెల్బోర్న్ నగరంలో ఉన్న క్రీడా స్టేడియం.[5] స్థానికంగా దీన్ని "ది జి" అని కూడా పిలుస్తారు.[6] మెల్బోర్న్ క్రికెట్ క్లబ్ దీన్ని నిర్మించింది. ఇది దక్షిణార్ధగోళంలో కెల్లా అతిపెద్ద స్టేడియం. ప్రపంచవ్యాప్తంగా 11వ అతిపెద్ద స్టేడియం. సామర్థ్యం ప్రకారం రెండవ అతిపెద్ద క్రికెట్ మైదానం. ఎమ్‌సిజి సిటీ సెంటర్ నుండి నడక దూరంలో ఉంది. ఇది మెల్బోర్న్ పార్క్ ప్రక్కనే ఉంది. మెల్బోర్న్ స్పోర్ట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఆవరణలో ఇది ఒక భాగం.[7]
MCG, The 'G | |
దస్త్రం:Melbourne Cricket Ground logo.png | |
Location | మెల్బోర్న్, ఆస్ట్రేలియా |
---|---|
Operator | మెల్బోర్న్ క్రికెట్ క్లబ్ |
Executive suites | 109 |
Capacity | 1,00,024[1] |
Record attendance |
|
Field size | 171 మీటర్లుx 146 మీటర్లు[3] |
Surface | పచ్చిక |
Construction | |
Opened | 1853 |
Renovated | 1992 (Southern Stand redevelopment) 2006 (Northern Stand redevelopment) 2032 (Proposed Shane Warne Stand redevelopment) |
Tenants | |
Melbourne Football Club (1858–present)
ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు (1877-ప్రస్తుతం)
మెల్బోర్న్ స్టార్మ్ (2000)
ఆస్ట్రేలియా మహిళల ఫుట్‌బాల్ జట్టు (ఎంచుకున్న మ్యాచ్‌లు) Melbourne Victory (international friendly matches) | |
మైదాన సమాచారం | |
ఎండ్ల పేర్లు | |
West: City End (AFL);[4] North: Members End (Cricket) South: Southern End (Cricket); East: Punt Road End[4] (AFL) | |
అంతర్జాతీయ సమాచారం | |
మొదటి టెస్టు | 1877 మార్చి 15–19: ఆస్ట్రేలియా v ఇంగ్లాండు |
చివరి టెస్టు | 2022 డిసెంబరు 26–29: ఆస్ట్రేలియా v దక్షిణాఫ్రికా |
మొదటి ODI | 1971 జనవరి 5: ఆస్ట్రేలియా v ఇంగ్లాండు |
చివరి ODI | 2022నవంబరు 22: ఆస్ట్రేలియా v ఇంగ్లాండు |
మొదటి T20I | 2008 ఫిబ్రవరి 1: ఆస్ట్రేలియా v India |
చివరి T20I | 2022 నవంబరు 13: ఇంగ్లాండు v పాకిస్తాన్ |
మొదటి మహిళా టెస్టు | 1935 జనవరి 18–20: ఆస్ట్రేలియా v ఇంగ్లాండు |
చివరి మహిళా టెస్టు | 1949 జనవరి 28–31: ఆస్ట్రేలియా v ఇంగ్లాండు |
మొదటి WODI | 1988 డిసెంబరు 18: ఆస్ట్రేలియా v ఇంగ్లాండు |
చివరి WODI | 2014 జనవరి 23: ఆస్ట్రేలియా v ఇంగ్లాండు |
మొదటి WT20I | 2008 ఫిబ్రవరి 1: ఆస్ట్రేలియా v ఇంగ్లాండు |
చివరి WT20I | 2020 మార్చి 8: ఆస్ట్రేలియా v India |
2022 29 December నాటికి Source: Cricinfo |
1853 లో నిర్మించినప్పటి నుండి, ఎమ్‌సిజిలో అనేకసార్లు పునర్నిర్మాణాలు జరిగాయి. 1956 సమ్మర్ ఒలింపిక్స్, 2006 కామన్వెల్త్ గేమ్స్, 1992, 2015 లలో జరిగిన రెండు క్రికెట్ ప్రపంచ కప్‌లకు ప్రధాన వేదికగా ఉంది. 2026 కామన్వెల్త్ క్రీడల ప్రారంభ వేడుకలు కూడా ఇక్కడే జరుగుతాయి. అంతర్జాతీయ క్రికెట్ అభివృద్ధిలో దాని పాత్ర ప్రసిద్ధి గాంచింది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ ల మధ్య 1877 లో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్‌కు, 1971లో జరిగిన మొదటి వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌కూ ఎమ్సిజియే వేదిక. 1859 నుండి ఆస్ట్రేలియా నియమాల ఫుట్‌బాల్‌తో బలమైన సంబంధాలున్నాయి. ప్రపంచంలో అత్యధికంగా హాజరైన లీగ్ ఛాంపియన్షిప్ ఈవెంట్ AFL గ్రాండ్ ఫైనల్‌తో సహా ఆస్ట్రేలియన్ ఫుట్‌బాల్ లీగ్ (AFL) మ్యాచ్‌లకు ఇదే ప్రధాన వేదిక. 2022 T20 ప్రపంచ కప్ గ్రాండ్ ఫైనల్ ఇక్కడే జరిగింది.
ఎమ్సిజిని వురుండ్జేరి క్యాంపింగ్ గ్రౌండ్, అనేక కరరోబోరీలు ఉండే ప్రదేశంలో నిర్మించారు.[8] 1838 నవంబరులో స్థాపించబడిన మెల్బోర్న్ క్రికెట్ క్లబ్ (MCC) మెల్బోర్న్ చుట్టుపక్కల ఉన్న అనేక మైదానాల్లో ఆడిన తర్వాత 1853లో ప్రస్తుత ఎమ్‌సిజి స్థలాన్ని ఎంపిక చేసుకుంది.[9] క్లబ్ మొదటి గేమ్ విలియం, లా ట్రోబ్ వీధులు కలిసే మూలన ఓల్డ్ మింట్ సైట్లో ఒక సైనిక జట్టుతో జరిగింది. 1839 జనవరిలో బరియల్ హిల్ (ప్రస్తుత ఫ్లాగ్‌స్టాఫ్ గార్డెన్స్) దాని హోమ్ గ్రౌండ్‌గా మారింది. అయితే ఆ ప్రాంతం అప్పటికే బొటానికల్ గార్డెన్స్ కోసం కేటాయించబడడంతో, 1846 అక్టోబరులో క్లబ్బును దక్షిణ ఒడ్డున, ప్రస్తుతం హెరాల్డ్ & వీక్లీ టైమ్స్ భవనం ఉన్న ప్రాంతానికి మార్చారు. ఆ ప్రాంతంలో వరదలు రావడాంతో క్లబ్బును మళ్లీ తరలించాల్సి వచ్చింది. ఈసారి దాన్ని దక్షిణ మెల్బోర్న్లోని మైదానానికి తరలించారు
కొద్దికాలంలోనే, ఈసారి రైల్వే విస్తరణ కారణంగా, క్లబ్బును మళ్లీ తరలించవలసి వచ్చింది. మెల్బోర్న్ నుండి సాండ్రిడ్జ్ (ప్రస్తుతం పోర్ట్ మెల్బోర్న్ ) వరకు వేసిన విక్టోరియా రాష్ట్రపు మొదటి ఆవిరి రైలు మార్గానికి అడ్డంగా దక్షిణ మెల్బోర్న్ మైదానం ఉంది. గవర్నర్ లా ట్రోబ్ MCCకి మూడు ప్రత్యామ్నాయ స్థలాలను సూచించాడు. అవి: ఇప్పటికే ఉన్న మైదానానికి ఆనుకొని ఉన్న ప్రాంతం, ఫ్లిండర్స్, స్ప్రింగ్ వీధుల కూడలి వద్ద ఒక స్థలం లేదా పది ఎకరాల (సుమారు 4 హెక్టార్లు) రిచ్మండ్ పార్క్ పక్కన రిచ్మండ్లోని ప్రభుత్వ పాడాక్ విభాగం.
MCC సబ్-కమిటీ రిచ్మండ్ పార్కు స్థలాన్ని ఎంచుకుంది. ఎందుకంటే ఇది క్రికెట్‌కు సరిపోయేలా సమతలంగా ఉండడమే కాక, వరదలను తట్టుకునేంతటి వాలు కూడా ఉంది.
అదే సమయంలో, గవర్నమెంట్ ప్యాడాక్‌కు తూర్పు వైపున ఉన్న 6 ఎకరాల స్థలాన్ని మరో క్రికెట్ మైదానాన్ని కోసం రిచ్మండ్ క్రికెట్ క్లబ్‌కు ఇచ్చారు.
భూమి మంజూరు సమయంలో, ప్రభుత్వం మైదానాన్ని క్రికెట్ కోసం మాత్రమే ఉపయోగించాలని షరతు విధించింది. ఈ పరిస్థితి సాంకేతికంగా 1933 వరకు కొనసాగింది.[10][11] 1933 లో వచ్చిన మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ చట్టం దాని ఉపయోగాల పరిధిని విస్తరించింది. 1933 చట్టం స్థానంలో 1989, 2009లో వేరే చట్టాలు వచ్చాయి.[12]
MCGలో మొట్టమొదటి గ్రాండ్‌స్టాండ్ 1854లో నిర్మించిన ఒరిజినల్ చెక్క స్టాండు. మొదటి పబ్లిక్ గ్రాండ్‌స్టాండ్ మాత్రం 1861లో నిర్మించిన 200 మీటర్ల పొడవు 6000 సీట్ల తాత్కాలిక నిర్మాణం. 1876 లో, 1877లో జేమ్స్ లిల్లీవైట్ నేతృత్వంలో ఇంగ్లీష్ క్రికెట్ జట్టు వచ్చిన సందర్భంగా మరో 2000 మంది కూర్చునేలా మరో గ్రాండ్‌స్టాండ్‌ను నిర్మించారు. ఈ పర్యటనలోనే MCGలో ప్రపంచపు మొట్టమొదటి టెస్టు మ్యాచ్ జరిగింది.
20వ శతాబ్దం ప్రారంభంలో మరిన్ని స్టాండ్లు నిర్మించారు. 1904లో మైదానానికి దక్షిణం వైపున ఒక ఓపెన్ చెక్క స్టాండ్ ఉండేది. 2084-సీట్లున్న గ్రే స్మిత్ స్టాండును (1912 వరకు న్యూ స్టాండ్ అని పిలుస్తారు) 1906లో సభ్యుల కోసం నిర్మించారు. మైదానం దక్షిణ భాగంలో 4000-సీట్ల హారిసన్ స్టాండును 1908లో నిర్మించారు. 198000 లో 12-సీట్ల వార్డిల్ స్టాండును నిర్మించారు. 1897 తర్వాత 15 సంవత్సరాలలో గ్రౌండ్లో గ్రాండ్‌స్టాండ్ సామర్థ్యం దాదాపు 20,000కి పెరిగింది. అప్పటికి మైదానం పూర్తి సామర్థ్యం దాదాపు 60,000.
ఆ తరువాతి సంవత్సరాలలో కొత్త స్టాండ్ల నిర్మాణం, పాతవాటి తీసివేతలు జరుగుతూ వచ్చాయి.
MCG ఆస్ట్రేలియా లోని మొట్టమొదటి పూర్తి రంగుల వీడియో స్కోర్‌బోర్డును ఎమ్‌సిజిలో 1982 లో ఏర్పాటు చేసారు. ఇది వెస్ట్రన్ స్టాండ్‌లోని 4వ లెవెల్లో ఉంది. 1999లో ఇది తగలబడడంతో 2000లో మళ్ళీ నిర్మించారు. రెండవ వీడియో స్క్రీన్ 1994లో ఒలింపిక్ స్టాండ్ లెవెల్ 4లో ఏర్పాటు చేసారు. 1985లో, రాత్రి ఫుట్‌బాల్ ఆట కోసం, డే-నైట్ క్రికెట్ ఆటల కోసం లైటింగు టవర్లను ఏర్పాటు చేశారు.
1988లో, పాత సదరన్ స్టాండుకు కాంక్రీట్ క్యాన్సర్ వచ్చింది. దాని స్థానంలో కొత్తది నిర్మించవలసి వచ్చింది. దానికయ్యే $10 కోట్ల అంచనా వ్యయాన్ని భరించగలిగే స్థితిలో మెల్బోర్న్ క్రికెట్ క్లబ్ లేదు. అప్పుడు విక్టోరియన్ ఫుట్‌బాల్ లీగ్, 30 సంవత్సరాల పాటు మైదానాన్ని గ్రౌండ్‌ను పంచుకునే ఒప్పందంతో నిధులు ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. కొత్త గ్రేట్ సదరన్ స్టాండు 1992 క్రికెట్ ప్రపంచ కప్ సమయానికి $15 కోట్ల ఖర్చుతో పూర్తయింది. 2022లో విక్టోరియన్ బౌలర్ షేన్ వార్న్ మరణించిన కొద్దికాలానికే దీనికి షేన్ వార్న్ స్టాండ్ అని పేరు పెట్టారు.[13]
1877లో జేమ్స్ లిల్లీవైట్ నేతృత్వంలో నాల్గవ పర్యటన జరిగే వరకు, పర్యాటక జట్లు స్థానిక కలోనియల్ జట్లతో ఫస్ట్-క్లాస్ గేమ్‌లు ఆడేవి. అయితే లిల్లీవైట్ న్యూ సౌత్ వేల్స్‌పై తన జట్టు బాగా రాణించిందనీ, తాము సంపూర్ణ ఆస్ట్రేలియా జట్టుతో మ్యాచ్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నామనీ భావించాడు.
లిల్లీవైట్ న్యూజిలాండ్ వెళ్తూ, తాము తిరిగి వచ్చేటప్పటికి ఆ మ్యాచ్‌ను ఏర్పాటు చేయమని మెల్బోర్న్ క్రికెటర్ జాన్ కాన్వేకి చెప్పాడు. కాన్వే, కాలనీల్లోని క్రికెట్ సంఘాలను పక్కనపెట్టి, స్వంతంగా తానే ఒక ఆస్ట్రేలియా జట్టును ఎంపిక చేసుకున్నాడు. నేరుగా ఆటగాళ్లతో చర్చలు జరిపాడు. అతను ఎంచుకున్న జట్టు ప్రాతినిధ్యం సందేహాస్పదంగా ఉండడం మాత్రమే కాదు, కొంతమంది ఆటగాళ్ళు వివిధ కారణాల వల్ల పాల్గొనడానికి నిరాకరించినందున అది బహుశా అంత బలమైన జట్టు కూడా కాదు. వికెట్ కీపర్ బిల్లీ మర్డోచ్ను ఎంపిక చేయనందున డెమోన్ బౌలర్ ఫ్రెడ్ స్పోఫోర్త్ ఆడేందుకు నిరాకరించాడు. పేస్‌మెన్ ఫ్రాంక్ అలన్ వార్నంబూల్ అగ్రికల్చరల్ షోలో ఉన్నాడు. ఆస్ట్రేలియా అత్యుత్తమ ఆల్-రౌండర్ ఎడ్విన్ ఎవాన్స్ తన ఉద్యోగం కారణాంగా ఆడలేకపోయాడు. చివరికి ఆస్ట్రేలియాలో జన్మించిన ఆటగాళ్లలో ఐదుగురిని మాత్రమే ఎంపిక చేశాడు.
లిల్లీవైట్ జట్టు పరిస్థితి కూడా ఇదేనని చెప్పవచ్చు. జట్టును కేవలం నాలుగు కౌంటీల నుండి ఎంపిక చేసిన ఆటగాళ్ళతో నింపారు. ఇంగ్లాండ్‌లోని అత్యుత్తమ ఆటగాళ్లలో కొందరు పాల్గొనలేదు. అదనంగా, బృందం టాస్మాన్ సముద్రం మీదుగా తిరిగి కఠినమైన సముద్రయానం చేయడంతో చాలా మంది సభ్యులు జబ్బుపడ్డారు. వారు వచ్చిన మరుసటి రోజు, మార్చి 15న, ఒక ఆట ఆడాల్సి ఉంది, కానీ అప్పటికి చాలా మంది ఇంకా పూర్తిగా కోలుకోలేదు. పైగా, వికెట్ కీపర్ టెడ్ పూలీ క్రైస్ట్‌చర్చ్ పబ్‌లో ఘర్షణ పడి, న్యూజిలాండ్ జైలులో పడ్డాడు.
ఆ ఆటలో ఇంగ్లండే ఫేవరిట్. మొదటి టెస్ట్ మ్యాచ్‌లో కేవలం 1000 మంది ప్రేక్షకులున్నారు. ఆస్ట్రేలియన్లు న్యూ సౌత్ వేల్స్ నుండి డేవ్ గ్రెగొరీని ఆస్ట్రేలియా మొట్టమొదటి కెప్టెన్‌గా ఎన్నుకున్నారు. టాస్ గెలిచిన అతను, బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు.
రిటైర్ అయ్యే ముందు చార్లెస్ బానర్‌మాన్ అజేయంగా 165 పరుగులు చేశాడు. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ క్యూరేటర్, నెడ్ గ్రెగొరీ, ఆస్ట్రేలియా తరపున తన ఏకైక టెస్టు ఆడుతూ టెస్ట్ క్రికెట్లో మొదటి డకౌట్ అయ్యాడు. ఆస్ట్రేలియా 245, 104 పరుగులు చేయగా, ఇంగ్లండ్ 196, 108 పరుగులు చేసి 45 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయం బ్యానర్‌మన్ సెంచరీపై ఆధారపడింది. టామ్ కెండాల్ ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 55 పరుగులకు 7 వికెట్లు తీసాడు.
పక్షం రోజుల తర్వాత మళ్ళీ ఆట జరిగింది. అది ఇంగ్లీష్ జట్టుకు బెనిఫిట్ మ్యాచ్. ఆస్ట్రేలియా జట్టులో స్పోఫోర్త్, మర్డోక్, TJD కూపర్లను చేర్చుకున్నారు. ఇంగ్లాండ్ నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది.
రెండు సంవత్సరాల తర్వాత లార్డ్ హారిస్ మరొక ఇంగ్లండ్ జట్టును తీసుకువచ్చాడు. MCGలో జరిగిన టెస్ట్‌లో ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్‌లో ఫ్రెడ్ స్పోఫోర్త్, టెస్ట్ క్రికెట్లో మొదటి హ్యాట్రిక్ సాధించాడు. ఆస్ట్రేలియా పది వికెట్లతో గెలిచింది. ఈ విజయంలో అతను 48 పరుగులకు 6 వికెట్లు, 62 పరుగులకు 7 వికెట్లు సాధించాడు.
సంఖ్య | జట్లు | మ్యాచ్ రకం | హాజరు | తేదీ |
---|---|---|---|---|
1 | ఆస్ట్రేలియా v న్యూజిలాండ్ | 2015 క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్ (ODI) | 93,013 | 2015 మార్చి 29 |
2 | ఆస్ట్రేలియా v ఇంగ్లాండ్ | టెస్టు | 91,112 | 2013 డిసెంబరు 26 |
3 | ఆస్ట్రేలియా v వెస్టిండీస్ | టెస్టు | 90,800 | 1961 ఫిబ్రవరి 11 |
4 | భారత్ వర్సెస్ పాకిస్థాన్ | 2022 పురుషుల T20 ప్రపంచ కప్ (సూపర్ 12) | 90,293 | 2022 అక్టోబరు 23 |
5 | ఆస్ట్రేలియా v ఇంగ్లాండ్ | టెస్టు | 89,155 | 2006 డిసెంబరు 26 |
6 | ఆస్ట్రేలియా v ఇంగ్లాండ్ | టెస్టు | 88,172 | 2017 డిసెంబరు 26 |
7 | ఆస్ట్రేలియా v ఇంగ్లాండ్ | టెస్టు | 87,789 | 1937 జనవరి 4 |
8 | ఇంగ్లండ్ v పాకిస్థాన్ | 1992 క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్ (ODI) | 87,182 | 1992 మార్చి 25 |
9 | భారత్ v సౌతాఫ్రికా | 2015 క్రికెట్ ప్రపంచ కప్ గ్రూప్ మ్యాచ్ | 86,876 | 2015 ఫిబ్రవరి 22 |
10 | ఆస్ట్రేలియా v భారత్ | 2020 ICC మహిళల T20 ప్రపంచ కప్ ఫైనల్ | 86,174 | 2020 మార్చి 8 |
MCG చరిత్రలో అత్యంత ప్రసిద్ధ క్షణం 1956 ఒలింపిక్ క్రీడలకు ప్రధాన స్టేడియంగా ఉండడం. ప్రారంభ, ముగింపు వేడుకలు, ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్లు, ఫీల్డ్ హాకీ, సాకర్ ఫైనల్‌లను ఇక్కడ నిర్వహించారు.[14]
కొత్తగా ఒలంపిక్ (లేదా నార్తర్న్) స్టాండ్ నిర్మించి MCG సామర్థ్యాన్ని పెంచారు. ప్రారంభ వేడుకల నాడు 1,03,000 మంది ప్రజలతో స్టేడియం నిండిపోయింది.
2006 కామన్వెల్త్ క్రీడల ప్రారంభ, ముగింపు వేడుకలు MCG లోనే జరిగాయి. అలాగే ఆటల సమయంలో అథ్లెటిక్స్ ఈవెంట్లు జరిగాయి. ఈ ఆటలు మార్చి 15న ప్రారంభమై మార్చి 26న ముగిశాయి.
MCGలో ఆల్-టైమ్ అత్యధిక హాజరు రికార్డులు | |||
సంఖ్య | హాజరు | ఈవెంట్ | తేదీ |
---|---|---|---|
1 | 143,000 | బిల్లీ గ్రాహం, క్రూసేడ్ | 1959 మార్చి 15 |
2 | 121,696 | VFL గ్రాండ్ ఫైనల్, Carlton v Collingwood | 1970 సెప్టెంబరు 26 |
3 | 120,000 | 40వ యూకారిస్టిక్ కాంగ్రెస్ | 1973 ఫిబ్రవరి 25 |
4 | 119,195 | VFL గ్రాండ్ ఫైనల్, Carlton v Richmond | 1969 సెప్టెంబరు 27 |
5 | 118,192 | VFL గ్రాండ్ ఫైనల్, Hawthorn v St Kilda | 1971 సెప్టెంబరు 25 |
పరుగులు | ఆటగాడు | కాలం |
---|---|---|
1,671 (17 ఇన్నింగ్స్) | డాన్ బ్రాడ్‌మాన్ | 1928–1948 |
1,338 (28 ఇన్నింగ్స్) | రికీ పాంటింగ్ | 1995–2011 |
1,284 (30 ఇన్నింగ్స్) | స్టీవ్ వా | 1985–2003 |
1,272 (36 ఇన్నింగ్స్) | అలన్ బోర్డర్ | 1978–1993 |
1,257 (31 ఇన్నింగ్స్) | గ్రెగ్ చాపెల్ | 1971–1983 |
పరుగులు | ఆటగాడు | కాలం |
---|---|---|
1,178 (18 ఇన్నింగ్స్‌లు) | జాక్ హాబ్స్ | 1908–1929 |
724 (7 ఇన్నింగ్స్) | హెర్బర్ట్ సుట్క్లిఫ్ | 1925–1933 |
661 (15 ఇన్నింగ్స్) | కోలిన్ కౌడ్రీ | 1954–1975 |
606 (11 ఇన్నింగ్స్) | వివ్ రిచర్డ్స్ | 1975–1988 |
505 (12 ఇన్నింగ్స్) | వాలీ హమ్మండ్ | 1928–1947 |
పరుగులు | ఆటగాడు | తేదీ |
---|---|---|
307 v. ఇంగ్లండ్ | బాబ్ కౌపర్ | 1966 ఫిబ్రవరి 11 |
270 v. ఇంగ్లండ్ | డాన్ బ్రాడ్‌మాన్ | 1937 జనవరి 1 |
268 v. పాకిస్తాన్ | గ్రాహం యాలోప్ | 1983 డిసెంబరు 26 |
257 v. భారతదేశం | రికీ పాంటింగ్ | 2003 డిసెంబరు 26 |
250 v. ఇంగ్లండ్ | జస్టిన్ లాంగర్ | 2002 డిసెంబరు 26 |
శతాబ్దాలు | ఆటగాడు | కాలం |
---|---|---|
9 (17 ఇన్నింగ్స్) | డాన్ బ్రాడ్‌మాన్ | 1928–1948 |
6 (19 ఇన్నింగ్స్‌లు) | మాథ్యూ హేడెన్ | 1996–2008 |
5 (18 ఇన్నింగ్స్‌లు) | జాక్ హాబ్స్ | 1908–1929 |
4 (7 ఇన్నింగ్స్) | హెర్బర్ట్ సుట్క్లిఫ్ | 1925–1933 |
4 (13 ఇన్నింగ్స్) | బిల్ లారీ | 1962–1971 |
4 (14 ఇన్నింగ్స్) | స్టీవ్ స్మిత్ | 2010–2021 |
4 (28 ఇన్నింగ్స్‌లు) | రికీ పాంటింగ్ | 1995–2011 |
4 (31 ఇన్నింగ్స్) | గ్రెగ్ చాపెల్ | 1971–1983 |
4 (36 ఇన్నింగ్స్) | అలన్ బోర్డర్ | 1978–1993 |
సగటు | ఆటగాడు | కాలం |
---|---|---|
128.53 (17 ఇన్నింగ్స్‌లు, 4 NO ) | డాన్ బ్రాడ్‌మాన్ | 1928–1948 |
103.42 (7 ఇన్నింగ్స్, 0 NO) | హెర్బర్ట్ సుట్క్లిఫ్ | 1925–1933 |
101.20 (5 ఇన్నింగ్స్‌లు, 0 NO) | బాబ్ కౌపర్ | 1964–1968 |
87.00 (6 ఇన్నింగ్స్‌లు, 1 NO) | అలిస్టర్ కుక్ | 2006–2017 |
84.72 (15 ఇన్నింగ్స్‌లు, 4 NO) | స్టీవ్ స్మిత్ | 2010–2021 |
వికెట్లు | ఆటగాడు | కాలం |
---|---|---|
82 (26 ఇన్నింగ్స్) | డెన్నిస్ లిల్లీ | 1972–1983 |
56 (21 ఇన్నింగ్స్) | షేన్ వార్న్ | 1992–2006 |
46 (13 ఇన్నింగ్స్) | హ్యూ ట్రంబుల్ | 1894–1904 |
45 (14 ఇన్నింగ్స్) | గ్రాహం మెకెంజీ | 1962–1968 |
42 (22 ఇన్నింగ్స్) | గ్లెన్ మెక్‌గ్రాత్ | 1995–2006 |
వికెట్లు | ఆటగాడు | కాలం |
---|---|---|
35 (10 ఇన్నింగ్స్) | సిడ్నీ బర్న్స్ | 1902–1912 |
27 (8 ఇన్నింగ్స్) | బాబీ పీల్ | 1885–1895 |
22 (8 ఇన్నింగ్స్) | బిల్లీ బేట్స్ | 1881–1885 |
22 (8 ఇన్నింగ్స్) | అలెక్ బెడ్సర్ | 1947–1951 |
22 (8 ఇన్నింగ్స్) | సర్ఫరాజ్ నవాజ్ | 1972–1983 |
గణాంకాలు | ఆటగాడు | తేదీ |
---|---|---|
9/86 v. ఆస్ట్రేలియా | సర్ఫరాజ్ నవాజ్ | 1979 మార్చి 10 |
9/121 v. ఇంగ్లండ్ | ఆర్థర్ మైలీ | 1921 ఫిబ్రవరి 11 |
8/68 v. ఆస్ట్రేలియా | విల్ఫ్రెడ్ రోడ్స్ | 1904 జనవరి 1 |
8/71 v. వెస్ట్ ఇండీస్ | గ్రాహం మెకెంజీ | 1968 డిసెంబరు 26 |
8/81 v. ఆస్ట్రేలియా | లెన్ బ్రాండ్ | 1904 మార్చి 5 |
8/143 v. ఇంగ్లండ్ | మాక్స్ వాకర్ | 1975 ఫిబ్రవరి 8 |
గణాంకాలు | ఆటగాడు | తేదీ |
---|---|---|
15/124 v. ఆస్ట్రేలియా | విల్ఫ్రెడ్ రోడ్స్ | 1904 జనవరి 1 |
14/102 v. ఆస్ట్రేలియా | బిల్లీ బేట్స్ | 1883 జనవరి 19 |
13/77 v. ఇంగ్లండ్ | మాంటీ నోబుల్ | 1902 జనవరి 1 |
13/110 v. ఇంగ్లండ్ | ఫ్రెడ్ స్పోఫోర్త్ | 1879 జనవరి 2 |
13/148 v. ఇంగ్లండ్ | బ్రూస్ రీడ్ | 1990 డిసెంబరు 26 |
13/163 v. ఆస్ట్రేలియా | సిడ్నీ బర్న్స్ | 1902 జనవరి 1 |
13/165 v. ఆస్ట్రేలియా | హ్యూ టేఫీల్డ్ | 1952 డిసెంబరు 24 |
13/236 v. ఇంగ్లండ్ | ఆర్థర్ మైలీ | 1921 ఫిబ్రవరి 11 |
స్ట్రైక్ రేటు | ఆటగాడు | కాలం |
---|---|---|
22.6 (6 వికెట్లు) | జాన్ హోడ్జెస్ | 1877–1877 |
31.1 (10 వికెట్లు) | లారీ నాష్ | 1932–1937 |
31.1 (15 వికెట్లు) | జస్ప్రీత్ బుమ్రా | 2018–2020 |
32.6 (35 వికెట్లు) | బ్రూస్ రీడ్ | 1985–1991 |
32.7 (18 వికెట్లు) | మైఖేల్ హోల్డింగ్ | 1976–1981 |
స్కోర్ | జట్టు | తేదీ |
---|---|---|
8/624డి | ఆస్ట్రేలియా v. పాకిస్తాన్ | 2016 డిసెంబరు 26 |
604 | ఆస్ట్రేలియా v. ఇంగ్లాండ్ | 1937 ఫిబ్రవరి 26 |
600 | ఆస్ట్రేలియా v. ఇంగ్లాండ్ | 1925 జనవరి 1 |
589 | ఇంగ్లాండ్ v. ఆస్ట్రేలియా | 1912 ఫిబ్రవరి 9 |
578 | ఆస్ట్రేలియా v. దక్షిణాఫ్రికా | 1911 ఫిబ్రవరి 17 |
పరుగులు | వికెట్ | ఆటగాళ్ళు | మ్యాచ్ | తేదీ |
---|---|---|---|---|
346 | 6వ | డాన్ బ్రాడ్‌మాన్ (270) & జాక్ ఫింగిల్టన్ (136) | ఆస్ట్రేలియా v. ఇంగ్లండ్ | 1937 జనవరి 1 |
323 | 1వ | విల్ఫ్రెడ్ రోడ్స్ (179) & జాక్ హాబ్స్ (178) | ఇంగ్లండ్ v. ఆస్ట్రేలియా | 1912 ఫిబ్రవరి 9 |
298 | 2వ | బిల్ లారీ (205) & ఇయాన్ చాపెల్ (165) | ఆస్ట్రేలియా v. వెస్ట్ ఇండీస్ | 1968 డిసెంబరు 26 |
283 | 1వ | హెర్బర్ట్ సట్‌క్లిఫ్ (176) & జాక్ హాబ్స్ (154) | ఇంగ్లండ్ v. ఆస్ట్రేలియా | 1925 జనవరి 1 |
279 | 6వ | ఆండ్రూ సైమండ్స్ (156) & మాథ్యూ హేడెన్ (153) | ఆస్ట్రేలియా v. ఇంగ్లండ్ | 2006 డిసెంబరు 26 |
పరుగులు | వికెట్ | ఆటగాళ్ళు | మ్యాచ్ | తేదీ |
---|---|---|---|---|
323 | 1వ | విల్ఫ్రెడ్ రోడ్స్ (179) & జాక్ హాబ్స్ (178) | ఇంగ్లండ్ v. ఆస్ట్రేలియా | 1912 ఫిబ్రవరి 9 |
298 | 2వ | బిల్ లారీ (205) & ఇయాన్ చాపెల్ (165) | ఆస్ట్రేలియా v. వెస్ట్ ఇండీస్ | 1968 డిసెంబరు 26 |
249 | 3వ | డాన్ బ్రాడ్‌మాన్ (169) & స్టాన్ మెక్‌కేబ్ (112) | ఆస్ట్రేలియా v. ఇంగ్లండ్ | 1937 ఫిబ్రవరి 26 |
262 | 4వ | విరాట్ కోహ్లీ (169) & అజింక్యా రహానే (147) | భారతదేశం v. ఆస్ట్రేలియా | 2014 డిసెంబరు 26 |
223* | 5వ | డాన్ బ్రాడ్‌మాన్ (127*) & ఆర్థర్ మోరిస్ (100*) | ఆస్ట్రేలియా v. భారతదేశం | 1948 జనవరి 1 |
346 | 6వ | డాన్ బ్రాడ్‌మాన్ (270) & జాక్ ఫింగిల్టన్ (136) | ఆస్ట్రేలియా v. ఇంగ్లండ్ | 1937 జనవరి 1 |
185 | 7వ | గ్రాహం యాలోప్ (268) & గ్రెగ్ మాథ్యూస్ (75) | ఆస్ట్రేలియా v. పాకిస్తాన్ | 1983 డిసెంబరు 26 |
173 | 8వ | నిప్ పెల్లెవ్ (116) & జాక్ గ్రెగొరీ (100) | ఆస్ట్రేలియా v. ఇంగ్లండ్ | 1920 డిసెంబరు 31 |
180 | 9వ | JP డుమిని (166) & డేల్ స్టెయిన్ (76) | దక్షిణాఫ్రికా v. ఆస్ట్రేలియా | 2008 డిసెంబరు 26 |
120 | 10వ | రెగీ డఫ్ (104) & వార్విక్ ఆర్మ్‌స్ట్రాంగ్ (45*) | ఆస్ట్రేలియా v. ఇంగ్లండ్ | 1902 జనవరి 1 |
చివరిగా 2022 డిసెంబరు 26న నవీకరించబడింది.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.