వాటికన్ నగరం
From Wikipedia, the free encyclopedia
vati can city
స్టేట్ డెల్లా సిట్టా డెల్ వాటికానో [1] వాటికన్ నగర రాజ్యము (స్టేట్ ఆఫ్ వాటికన్ సిటీ) |
||||||
---|---|---|---|---|---|---|
జాతీయగీతం |
||||||
రాజధాని | వాటికన్ సిటీ[2] 41°54′N 12°27′E | |||||
అధికార భాషలు | చట్టబద్ధంగా ఏదీ లేదు[3] ఇటాలియన్ (డిఫాక్టో)[4] |
|||||
ప్రభుత్వం | ఎక్లెసియస్టికల్[5] (ఎన్నుకున్న రాజరికం) |
|||||
- | పోప్ | పోప్ బెనడిక్ట్ 16 | ||||
- | ప్రభుత్వ రాష్ట్రపతి | జియొవాన్ని లజోలో | ||||
స్వతంత్రం | ఇటలీ రాజ్యం నుంచి | |||||
- | లాటెరన్ ఒప్పందం | 1929 ఫిబ్రవరి 11 | ||||
జనాభా | ||||||
- | 2008 అంచనా | 824 (220వ) | ||||
కరెన్సీ | Euro (€)[6] (EUR ) |
|||||
కాలాంశం | సెంట్రల్ యూరోపియన్ టైమ్ (UTC+1) | |||||
- | వేసవి (DST) | సీఈఎస్టి (UTC+2) | ||||
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ | .va | |||||
కాలింగ్ కోడ్ | +379 |
వాటికన్ (ఆంగ్లం : Vatican City) అధికారిక నామం "స్టేట్ ఆఫ్ వాటికన్ సిటి", " వాటికన్ సిటీ స్టేట్ " (లాటిన్: సివిటాస్ వాటికానా) (పౌరసత్వం వాటికనీ) [7] ఒక నగర-రాజ్యం. రోమ్ నగర ప్రాంతంలోనే గల ఒక స్వతంత్ర రాజ్యం. ప్రపంచంలోకెల్లా వైశాల్యంలోనూ, జనాభాలోనూ కూడా అత్యంత చిన్న దేశం[8][9] ఇది 1929లో ఏర్పడింది. దీని వైశాల్యం దాదాపు 44 హెక్టార్లు (110 ఎకరాలు), జనాభా 1000.
ఇది రోమ్ బిషప్ - పోప్ పాలించే ఒక మతపరమైన [8] రాచరికం.[10] ఇది రాజ్యాధినేత అయిన మతాధిపతిని ఎన్నిక ద్వారా ఎంచుకునే వ్యవస్థ. వాటికన్ సిటీలోని అత్యున్నత రాజ్య కార్యనిర్వాహకులు వివిధ జాతీయ మూలాలకు చెందిన కాథలిక్ మతాధికారులు. 1377లో ఎవిగ్నాన్ నుండి పోప్లు తిరిగి వచ్చిననాటి నుంచి సాధారణంగా వాటికన్ సిటీలోని అపోస్టోలిక్ ప్యాలెస్‌లో నివసిస్తున్నారు. అయితే అప్పుడప్పుడు రోమ్‌లోని క్విరనల్ ప్యాలెస్, వంటి ఇతర ప్రదేశాల్లో నివసించారు.
హోలీ సీ (లాటిన్: సాన్కా సెడెస్) నుండి వాటికన్ నగరం భిన్నమైనది. హోలీ సీ అన్నది తొలినాటి క్రైస్తవ మతానికి చెందినది, ప్రపంచవ్యాప్తంగా 1.2 బిలియన్ సంఖ్యలోని లాటిన్, తూర్పు కాథలిక్ విశ్వాసుల ప్రధాన పవిత్ర పాలనా ప్రాంతం. ఈ స్వతంత్ర నగర రాజ్యం 1929 లో ఉనికిలోకి వచ్చింది. హోలీ సీకి, ఇటలీకి మధ్య లాటెర్ ఒప్పందం ద్వారా దీన్ని కొత్తగా సృష్టించారు.[11] ఒప్పందంలోని నిబంధనల ప్రకారం హోలీ సీకి ఈ నగరం మీద "పూర్తి యాజమాన్యం, ప్రత్యేక అధినివేశ రాజ్యం, సార్వభౌమ అధికార పరిధి" ఉంది.[12]
వాటికన్ నగరంలో సెయింట్ పీటర్స్ బసిలికా, సిస్టీన్ ఛాపెల్, వాటికన్ మ్యూజియమ్స్ వంటి మతపరమైన, సాంస్కృతిక ప్రదేశాలున్నాయి. ఆయా ప్రదేశాలు ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ చిత్రాలు, శిల్పాలను కలిగి ఉన్నాయి. వాటికన్ సిటీ ప్రత్యేక ఆర్థిక వ్యవస్థకు తపాలా స్టాంపులు, పర్యాటకం, జ్ఞాపికల అమ్మకాలు, సంగ్రహాలయాలకు ప్రవేశ రుసుము, ప్రచురణల అమ్మకం వంటివి మద్దతునిస్తాయి.