సహాయం:దస్త్రాలు
From Wikipedia, the free encyclopedia
దస్త్రం పేరుబరి అనేది వికీపీడియా లోని మీడియా కంటెంట్ మొత్తం ఉండే నిర్వహణ పేజీలతో కూడుకుని ఉండే పేరుబరి. వికీపీడియాలో, మీడియా ఫైళ్ళ పేర్లన్నీ, బొమ్మలకు సంబంధించిన డేటా ఫైళ్ళు, వీడియో క్లిప్‌లు, ఆడియో క్లిప్‌లు, డాక్యుమెంట్ లెంగ్త్ క్లిప్‌లతో సహా, లేదా MIDI దస్త్రాలు (కంప్యూటర్లో మ్యూజిక్ సూచనల చిన్న దస్త్రం) దస్త్రం:
అనే ఆదిపదంతో మొదలౌతాయి.
ఇదొక సమాచారం పేజీ. ఇది వికీపీడియా విధానం గానీ, మార్గదర్శకం గానీ కాదు. ఇది వికీపీడియా సంప్రదాయాలు, కట్టుబాట్లు, సాంకేతికాంశాలు, అవలంబించే పద్ధతులకు సంబంధించిన కొన్ని విషయాలను వివరిస్తుంది.. ఇందులో ఏకాభిప్రాయం, అర్థ స్వీకరణ లలో విభిన్న స్థాయిలు ఉండవచ్చు. |
ఈ పేజీ గురించి ఒక్క ముక్కలో: వికీపీడియాలో ఏదైనా బొమ్మనో, ఇతర మీడియా ఫైలునో వాడాలంటే ముందు దాన్ని ఎక్కించాలి, ఆ తరువాత వికీపీడియా పేజీలోకి చేర్చాలి. |
దస్త్రాల కోసం వెతకండి లేదా మీ స్వంత దస్త్రాన్ని ఎక్కించండి. (కింద ఉన్నదస్త్రాలను ఎక్కించడం చూడండి. ) వెతికినపుడు, వెతుకులాట పదాలు ఉన్న ప్రతి దస్త్రం పేజీని చూపిస్తుంది. వెతుకు పెట్టెలో దస్త్రం: వివరణాత్మక పదాలు నమోదు చేయండి. ఉదాహరణకు, వెతుకులాట పదాల్లో బొమ్మ, వీడియో, మిడి వంటి పదాలను కూడా చేర్చండి. అప్పుడు, పేజీ పేరును కనుగొనడం ద్వారా, సంబంధిత పేజీలో ఆ మీడియాను చొప్పించవచ్చు. వ్యాసాలను గణనీయంగా మెరుగుపరచడానికి ఇది సులభమైన మార్గం. (క్రింద ఉన్న దస్త్రాలను ఉపయోగించడం చూడండి.) ఉదాహరణకు, File: swim video కోసం వెతికినపుడు, ఫలితాల్లో "దస్త్రం:CI 2011 swim 04 jeh.theora.ogv" అనే పేజీ కనిపిస్తుంది.
మామూలు వికీలింకు సింటాక్స్‌తో పోలిస్తే దస్త్రాన్ని వాడేందుకు వాడే సింటాక్సులో అర్థం పరంగా మూడు తేడాలు ఉన్నాయి:
- ఏదైనా పేజీలో దస్త్రం:''' ''PAGENAME అని రాస్తే, అది సదరు దస్త్రాన్ని ఆ పేజీలో ఫైల్ లింకులో ట్రాన్స్‌క్లూడు చేస్తుంది. ఫైల్ లింక్ అనేది దస్త్రం' పేరుబరి నుండి, పూర్తి ట్రాన్స్క్లూజన్ పారామితులతో చేసే ట్రాన్స్క్లూజన్.
- 'దస్త్రం:''' ''PAGENAME, ముందు కోలన్ ఉంటుంది. ఇది బొమ్మ, వీడియో, లేదా ఆడియో ల ఫైలు పేజీకి లింకు ఇస్తుంది;
- [[మీడియా: PAGENAME]] నేరుగా బొమ్మను గానీ, ఆడియో, వీడియో ను గానీ నేరుగా చూపించే లింకును చూపిస్తుంది (ఇది ఫైలు పేజీ కంటే భిన్నం). ఆ లింకును నొక్కినపుడు సంబంధిత ఫైలు కనిపిస్తుంది -దస్త్రం వివరణ, లైసెన్సు వగైరా వివరాలేమీ లేకుండా.
గతంలో వాడుకలో ఉన్న పేరుబరి, చిత్రం: (ఇప్పుడు నిలిపేసారు) ను వాడిన పాత పేజీలతో అనుకూలత కోసం, అది ఇప్పటికీ పనిచేస్తుంది. అయితే "ఇమేజ్" అనేది ఇప్పుడు చిత్రాల తో పాటు మరిన్ని రకాల డేటా ఫైల్‌లను కూడా సూచిస్తుంది.