బాసర
తెలంగాణ, నిర్మల్ జిల్లాలోని బాసర మండల కేంద్రం / From Wikipedia, the free encyclopedia
బాసర, తెలంగాణ రాష్ట్రం, నిర్మల్ జిల్లా, బాసర మండలానికి చెందిన గ్రామం.[1] 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత ఆదిలాబాద్ జిల్లా లోని ముధోల్ మండలంలో ఉండేది. పునర్వ్యవస్థీకరణలో దీన్ని కొత్తగా ఏర్పాటు చేసిన బాసర మండలం లోకి చేర్చారు. [2]ఇది సమీప పట్టణమైన భైంసా నుండి 28 కి.మీ, నిజామాబాదు పట్టణానికి 35 కి.మీ దూరంలో గోదావరి నది ఒడ్డున ఉంది. హైదరాబాదుకు సుమారు 200 కి.మీ. దూరంలో ఉంది. ఇక్కడ బాసర ట్రిపుల్ ఐటి ఉంది.
త్వరిత వాస్తవాలు అక్షాంశరేఖాంశాలు: 18.885533°N 77.952477°E /, రాష్ట్రం ...
బాసర | |
— రెవెన్యూ గ్రామం — | |
శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం, బాసర | |
అక్షాంశరేఖాంశాలు: 18.885533°N 77.952477°E / 18.885533; 77.952477 | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | నిర్మల్ జిల్లా |
మండలం | బాసర |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
జనాభా (2011) | |
- మొత్తం | 5,865 |
- పురుషుల సంఖ్య | 2,868 |
- స్త్రీల సంఖ్య | 2,997 |
- గృహాల సంఖ్య | 1,362 |
పిన్ కోడ్ | 504101 |
ఎస్.టి.డి కోడ్ |
మూసివేయి