ఐ
From Wikipedia, the free encyclopedia
Remove ads
తెలుగు వర్ణమాలలో "ఐ" 13వ అక్షరం.[1] అంతర్జాతీయ ధ్వని వర్ణమాల (అంతర్జాతీయ ధ్వన్యాత్మక వర్ణమాల) లో దీని సంకేతం [ai]. అంతర్జాతీయ సంస్కృత లిప్యంతరీకరణ వర్ణమాల లోనూ ఐఎస్ఒ 15919 లోనూ దీని సంకేతం [ai]. దీని యూనీ కోడ్ U+0C10.[2] ఇది కంఠతాలువు లైన ఎ,ఏ,ఐ లలో ఒకటి.[3] ఇది అచ్చులలో దీర్ఘములకు చెందిన అక్షరం. దీర్ఘములనగా చాచిపలుకబడునవి అని అర్థం. ఐ-ఔ-లు వక్రతమములు అని కూడా అంటారు.[4]
Remove ads
పదము
ఐ అక్షరమే కాకుండా ఒక పదంగా కూడా ఆర్థాలున్నాయి. బ్రౌణ్య తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు (1903) ప్రకారం "ఐ", "అయి" అనునది భూతకాలంలో జరిగిన పనిని సూచించును. ఉదాహరణకు:
- మానై నిలిచెను.
- అక్కడికి వాచ్చేవాడినై యుంటిని.
ఆంధ్రశబ్దరత్నాకరము (చెలమచెర్ల రంగాచార్యులు)-1966 ప్రకారం సంస్కృత వర్ణమాలలోని పండ్రెండవ అక్షరము. తెలుఁగు వర్ణమాలలో ఇది ఎనిమిదవది. దీర్ఘము. కంఠ్యతాలవ్యము. ఉదాత్తానుదాత్త స్వరితములు అనునాసికాననునాసికములు అను భేదములచే ఇది ఆఱువిధములు. ప్లుతమైన ఐకారము కూడ ఇట్లే ఆఱువిధములు. మొత్తము పండ్రెండు విధములు. ఆంధ్ర వ్యాకరణ పరిభాషలో దీనికి వక్రతమమని వ్యవహారము.[5]
తెలుగు వ్యుత్పత్తి కోశం (ఆంధ్రవిశ్వకళాపరిషత్తు) -1978 ప్రకారం తెలుగు వర్ణమాలలోని తొమ్మిదో అక్షరం. ద్రావిడ భాషల్లో 'ఐ' వర్ణంగా లేదు. సంస్కతంలో 'ఆ', 'ఇ' లు కలిసి ఏర్పడ్డ సంధ్యక్షరం ప్రసిద్దంగా ఉంది. తత్సామ్యం వల్ల లెలుగు మొదలైన ద్రావిడ భాషల్లో దీన్ని వర్ణంగా గ్రహించారు. కాని ధ్వనిశాస్త్రజ్ఞులు దీన్ని 'అయ్' గా గ్రహిస్తారు.
పారమార్థిక పదకోశం (పొత్తూరి వేంకటేశ్వరరావు) -2010 ప్రకారం ఈ అక్షరాన్ని విడిగా కాక మరేదైనా పదంతో కలిపి శివుడు అనే అర్థంలో ప్రయోగించవచ్చు
Remove ads
మూలాలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads