విళుపురం జిల్లా

తమిళనాడు లోని జిల్లా From Wikipedia, the free encyclopedia

విళుపురం జిల్లాmap
Remove ads

విళుపురం/విల్లుపురం' (Viluppuram, Villupuram and Vizhupuram) తమిళనాడు రాష్ట్రంలోని జిల్లాలలో ఇది ఒకటి, జిల్లా కేంద్ర విళుపురం పట్టణం. ఈ జిల్లా 1993 సెప్టెంబరు 30న దక్షిణ ఆర్కాట్ (South Arcot) జిల్లా నుండి ఏర్పడింది. పూర్వపు దక్షిణ ఆర్కాట్ జిల్లా అవశేష భాగానికి కడలూరు జిల్లా అని పేరు పెట్టారు.దీని కారణంగా, విలుప్పురం జిల్లా చరిత్ర కడలూర్‌ను పోలి ఉంటుంది. చోళులు దీని తొలి పాలకులు.[2] విళుపురం జిల్లాలో 9 తాలూకాలు ఉన్నాయి.విళుపురం జిల్లా 2,717 చదరపు కిలోమీటర్లు వైశాల్యం కలిగిఉంది.2011 భారత జనాభా గణాంకాలను అనుసరించి విళుపురం జనాభా సంఖ్య 34,63,284, భారతదేశ జిల్లాలలో జనాభాపరంగా 640 జిల్లాలలో విళుపురం 93వ స్థానంలో ఉంది.[3] జిల్లా జనసాంద్రత చదరపు కిల్లోమీటరుకు 482గా ఉంది.[3] 2001 గణాంకాలను అనుసరించి విళుపురం జనసంఖ్య 29,60,373.[4]

త్వరిత వాస్తవాలు Viluppuram District, Country ...
Remove ads

భౌగోళికం

విలుప్పురం జిల్లా 11 38 25N, 12 20 44 S 78 15 00 W, 79 42 55 E అక్షాంశ రేఖాంశాల మధ్య 7222.03 హెక్టార్ల వైశాల్యంతో ఉంది. ఈ జిల్లాకు సరహద్దులుగా తూర్పు దక్షిణాన కడలూరు జిల్లా, పశ్చిమాన సేలం, ధర్మపురి జిల్లాలు, ఉత్తరాన తిరువణ్ణామలై, కాంచీపురం జిల్లాలు ఉన్నాయి.విళుపురం జిల్లా 2,717 చదరపు కిలోమీటర్లు వైశాల్యం కలిగిఉంది

చరిత్ర

మొదటి 4 శతాబ్ధాల కాలం ఈ భూభాగం చోళ రాజైన కరికాచోళ పాలకుల ఆధీనంలో ఉంది.[2] అప్పుడు అత్యంత శక్తివంతంగా స్వతంత్రంగా ఉంటూ వచ్చింది. సింహ విష్ణు పల్లవుల చేతిలో చోళులు ఓటమి పాలైన తరువాత ఈ భూభాగం పల్లవుల ఆధీనంలోకి వచ్చింది. విజయాలయ చోళుడు ఈ భూభాగాన్ని తిరిగి స్వాధీనపరచుకున్నాడు. అతిగొప్పదైన చోళసామ్రాజ్యానికి ఈ విజయం నాంది అయింది. చోళులు తమపూర్వ వైభవాన్ని తిరిగి స్వాధీనపరచుకున్నా 1252 మొదటి జాతవర్మ దుందరపాండ్యన్ తలెత్తిన తరువాత ఈ భూభాగం మీద చోళుల అధికారంలోకి వచ్చారు. 50 సంవత్సరాల తరువాత ఈ భూభాగం మీద పాండ్యుల అధికారం ముగింపుకు వచ్చింది. తరువాత 1334 నుండి 1378 వరకు ముస్లిముల అధికారం కొనసాగింది. 1378 నుండి ఈ భూభాగం విజయనగరం పాలకులు సామంతులైన నాయకాల ఆధీనంలోకి మారింది. 1677లో శివాజీ జింగీ ప్రాంతాన్ని గోల్కొండ సైన్యం సహాయంతో స్వాధీనపరచుకున్నాడు. తతువాత మొగలాయి పాలకుల ఆధీనంలోకి మారింది. మొగల్ సామ్రాజ్య కాలంలోనే దక్షిణ ఆర్కాడులో ఆంగ్లేయులు, ఫ్రెంచి నివాసాలు ఆరంభం అయ్యాయి. ఆంగ్ల, ఫ్రెంచి వారి మద్య సాగిన పోరులో ఈ ప్రాంతం మొత్తం యుద్ధరంగంగా మారింది. యుద్ధానంతరం ఈ భూభాగం అంతా ఆంగ్లేయుల పాలనలోకి వచ్చింది.1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చే వరకు ఈ భూభాగం ఆంగ్లేయుల పాలనలోనే ఉంది.[5][6]

Remove ads

గణాంకాలు

మరింత సమాచారం సంవత్సరం, జనాభా ...

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, విలుప్పురం జిల్లాలో 34,58,873 జనాభా ఉంది. ప్రతి 1,000 మంది పురుషులకు 987 మంది స్త్రీల లింగ నిష్పత్తి ఉంది, ఇది జాతీయ సగటు 929 కంటే చాలా ఎక్కువఉంది .[8] మొత్తం జనాభాలో 4,04,106 మంది నివాసితులు ఆరు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు ఉన్నారు, వీరిలో 2,08,246 మంది పురుషులు ఉండగా, స్త్రీలు 1,95,860 మంది ఉన్నారు. షెడ్యూల్డ్ కులాలు జనాభా 29.37% మంది ఉండగా, షెడ్యూల్డ్ తెగలు జనాభా 2.16% మంది ఉన్నారు.జిల్లా సగటు అక్షరాస్యత 63.48 ఉంది.దీనిని జాతీయ సగటు 72.99%తో పోలిస్తే తక్కువ ఉంది [8] జిల్లాలో మొత్తం 8,00,368 కుటుంబాలు ఉన్నాయి.మొత్తం జనాభాలో 3,22,900 మంది రైతులు, 5,37,581 మంది వ్యవసాయ కార్మికులు, గృహ పరిశ్రమలలో 23,961 మంది, ఇతర కార్మికులు 3,76,360 మంది, ఉపాంత కార్మికులు 4,42,447 మంది ఉపాంత కార్మికులు, 46,746 మంది సన్నకారు రైతులు, 2,94,632 మంది సన్నకారు కార్మికులతో సహా మొత్తం 17,03,249 మంది కార్మికులు ఉన్నారు.[9]

ఆర్ధికం

Thumb
జింగీకోట (రాజా దేశింగ్)

2008లో పంచాయితీరాజ్ శాఖ 640 దేశీయ జిల్లాఅలో పేద జిల్లాలుగా గుర్తించబడిన 250 జిల్లాలలో విళుపురం ఒకటిగా గుర్తించింది.[10] తమిళనాడు లోని 6 వెనుకబడిన జిల్లాలలో ఒకటిగా ప్రభుత్వరంగానికి చెందిన " బ్యాక్‌గ్రౌండ్ రీజంస్ గ్రాంట్ ఫండ్ ప్రోగ్రాం " ద్వారా నిధులు అందుకుంటుంది.[10]

విభాగాలు

విళుపురం జిల్లాలో విళుపురం, కళ్ళకురుచ్చి, శకంరపురం, చిన్నసేలం, ఉళుందూర్ పేట్టై, దిండివనం, తిరుకోయిలూర్, వనూర్, జింగీ అనే 9 తాలూకాలు ఉన్నాయి.

జిల్లా లోని ప్రముఖ యాత్రాప్రదేశాలు

ఒళిందియం పట్టు: తిరుఙాన సంబందర్ పాడిన దేవరం పాటలలో ఈ ఆలయం ప్రశంసించబడింది. యముని దూరంగా పంపిన వాడు, మన్మధుని జయించిన వాడు, భక్తుల వద్ద భిక్షను స్వీకరించిన వాడు, కొంరై పూలు ధరించిన వాడు, బ్రహ్మకపాల మాల ధరించిన వాడు, శ్మశానభస్నధారుడు అయిన శివుడు ఇక్కడ నివసిస్తున్నాడని వర్ణించబడింది. ఒళిందియపట్టు దేవారాంలో వర్ణించబడింది తొండైనాడులో ఉన్న 31వ శివాలయం అని విశ్వసించబడుతుంది. ఈ ఆలయంలో మే-జూన్ మాసాలలో వైఖాశి 10వ రోజు బ్రహ్మోత్సవం, ఫిబ్రవరి- మార్చి మాసాలలో శివరాత్రి, నవంబరు-డిసెంబరు మాసాలలో తిరుకార్తికై ఉత్సవాలు జరుగుతుంటాయి. ఇది శివుడు స్వయంభువుగా వెలిసిన క్షేత్రం.

ఆలయచరిత్ర

వామదేవుడు తాను పొందిన శాపం నుండి విమోచనం కొరకు పవిత్ర శివాలయాలను దర్శిస్తూ విళుపురంలోని ఆలయాన్ని సందర్శించాడు. అతను ఇక్కడకు వచ్చి ఇక్కడి రావిచెట్టు కింద కూర్చోగానే మనసు ప్రశాంతి చెందింది. అప్పుడాయన ఈశ్వరుడు రావిచెట్టుకింద ఉన్నాడని భావించాడు. వామదేవుని మనసు తెలుసుకుని ఈశ్వరుడు ఇక్కడ వామదేవుడిగా స్వయంభువు మూర్తిగా వెలిసాడు. వామదేవుడు వెంటనే పక్కన ఉన్న జలధారలలో స్నానం చేసి అక్కడే ఆ శివలింగాన్ని ప్రతిష్ఠించి ఆరాధించసాగాడు. తమిళంలో రావి చెట్టును అరశామరం అంటారు. కనుక ఈశ్వరుడికి " అరశలీశ్వరుడు" అని ఈ ప్రదేశానికి " అరసిలి " అని నామకరణం చేసాడు. తరువాత కొన్ని రోజుల తరువాత ఆ ప్రదేశంలోని శివలింగం అదృశ్యం అయింది. ఆ ప్రదేశం చాళుక్య రాజులలో ఒకడైన " సత్యదేవన్" ఆధీనంలో ఉంటూ వచ్చింది. సత్యదేవన్ గొప్పశివభక్తుడు. అతనికి పిల్లలు లేరు. అతను ఒక వనం ఏర్పాటుచేసి అందులో శివలింగం ప్రతిష్ఠించి ఆరాధించసాగాడు. ఒకరోజు సేవకుడు తోటలోని చెట్లకు పూలులేకపోవడం గమనించాడు. రాజుకు నివేదించాడు. రాజు అది అంత ముఖ్యమైన విషయంగా భావించలేదు. మరునాడు కూడా సేవకుడు ఆ విషయం విన్నవించాడు. పూల దొంగను పట్టుకోవడానికి రాజు తోటలో చాటుగా ఉండి చూడసాగాడు. ఒక జింక తోటలో ప్రవేశించి పూలను ఆనందంగా తినసాగింది. రాజు శివపూజకు ఉపయోగించే పూలను ఒక జంతువు తినడం సహించలేక జింక మీద బాణం ఎక్కుపెట్టాడు. జింక తప్పించుకుని పోయింది. బాణం రావిచెట్టుకు గుచ్చుకుంది. చెట్టు నుండి రక్తం స్రవించసాగింది. రాజు దెబ్బతిన్న జింకను చూడడానికి దగ్గరకు వెళ్ళిన తరుణంలో అక్కడ రాజుకు జింకకు బదులు బాణం దెబ్బ వలన చెట్టుకు ఏర్పడిన తొర్రలో శివలింగం కనిపించింది. ఆదే వామదేవుడి ప్రతిష్ఠించి ఆరాధించిన తరూవాత మాయమైన శివలింగం అని రాజు గ్రహించాడు. రాజు రక్తంస్రవిస్తున్న శివలింగం ముందు మోకరిల్లి క్షమించమని వేడుకున్నాడు. అప్పుడు శివుడు ప్రతక్షమై జింక రూపంలో వచ్చింది తానే అని చెప్పి రాజుకు పుత్రసంతానం కలగాలని ఆశీర్వదించాడు. రాజు అక్కడ శివునికి ఆలయం కట్టించి ఆరాధించసాగాడు.

ఈ ఆలయంలో రుద్రాక్షపందిరి కింద ఉన్న స్వయంభూ శివలింగం భక్తులను ఆశీర్వదిస్తూ ఉంది. శివలింగం మీద బాణం గుర్తు ఇప్పటికీ కనిపిస్తూ ఉంది. పూజలు చేసే సాయంలో శివుని గాయానికి బాధ కలగకుండా కట్టు కట్టి పూజలు నిర్వహిస్తారు. సంబందర్ ఇక్కడ కొంతకాలం నివసించాడు. అతను ఆసమయంలో 108 పతిగంలను వ్రాసాడు. మాత పెరియనాయకికి ఇక్కడ దక్షిణాభి ముఖంగా ప్రత్యేక ఆలయం ఉంది.[11]

మేల్ సిదమూర్ జైన్ మఠం

Thumb
మేల్ సీతామూర్ జైన మఠం, భట్టారక లక్ష్మీసేన నివాసం, విలుపురం

కండాచిపురం

మేల్ సిదమూర్ జైన్ మఠం లేక జైన్ కాంచి జైన్ విళుపురం జిల్లా మఠం జింగీ సమీపంలో ఉంది.[12] తమిళనాడులోని జైనమతస్తులకు ఇది ప్రముఖ పుణ్యక్షేత్రంగా భాసిల్లితుంది.[13] ఈ మఠానికి జైన మతభట్టరకుడైన భట్టారక లక్ష్మణ్‌ స్వామీజీ ఆఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది.[14]

చండమంగళం

ఇక్కడ " అబాత సహేశ్వరరాలయం " గ్రామప్రవేశం లోనే ఉంది. ఈ ఆలయం రాజా కోపెరుంసింగన్ కడవరాయన్ కోటలో ఒక భాగంగా ఉంది. ఇది చాలా సంవత్సరాల ముందే ధ్వంసం చేయబడింది. ప్రస్తుతం ఈ ఆలయం కేంద్రప్రభుత్వ ఆధీనంలో అభివృద్ధిచేయబడుతుంది. ఈ ఆలయం జాతీయరహదారి 45లో పక్కన గెడిలం నదీ సమీపంలో ఉంది.

తిరుకోయిలూరు

ఈ ఊరిలో విష్ణుమూర్తి త్రివిక్రమస్వామి & వేదవల్లి తాయారు (వామనావతారం) పేర్లతో పూజలందుకుంటున్నాడు. ఈ ఆలయం ఊరి మద్య భాగంలో ఉంది. ఈ ఆలయం 108 దివ్యదేశాలలో ఒకటి. ఊరికి తూర్పుదిక్కున తెన్‌పెన్నై నదీతీరంలో ఈశ్వరాలయం ఉంది. ఈ ఆలయసమీపంలో కపిలర్ కున్రు అనే చిన్నకొండ ఉంది. అష్టవీరాటనాలలో తిరుకోవిలూరు ఒకటి. ఇక్కడ శ్రీ రఘుథామతీర్ధర్ మూల బృందావనం (సా.శ. 1595), శ్రీ సత్యప్రమోద తీర్ధ మూల బృందావనం (సా.శ.1997) ఉన్నాయి. తిరుకోయిలూరులో మధ్వాచార్య వణ్శవళికి చెందిన " ఉత్తరాది మఠం " ఉంది. అంతే కాక ప్రఖ్యాత జ్యోతిర్లింగ మఠాలలో ఒకటైన " శ్రీ గణానంద తపోవనం " తిరుకోయిలూరులో తిరువణ్ణామలై రహదారకి సమీపంలో ఉంది. శ్రీ గణానంద స్వామిగళ్ చేత స్థాపించబడిన ఈ మఠానికి స్వామి ఆశిర్వాదం అందుకోవడానికి భక్తులు వస్తూ ఉంటారు.

మేల్‌మలయనూరు

మేల్‌మరువనూరులో ఉన్న " అంకాళపరమేశ్వరి" అమ్మవారిని దర్శించడానికి భక్తులు అమావాస్యరోజు ప్రత్యేకంగా వస్తుంటారు.

అన్నియూర్

అన్నియూర్ శివుడు, విష్ణువు ఆలయాలకు ప్రసిద్ధి. రెండు ఆలయాలు ఊరికి మద్యభాగంలో ఉన్నాయి. శివాలయంలో ఉన్న శనీశ్వరవిగ్రహం ముఖ్యమైనవాటిలో ఒకటి.

తిరువమదూర్

తిరువమదూర్ ఆలయం ప్రత్యేకంగా శివాలయానికి ప్రసిద్ధిచెందింది. ఈ ఆలయంలో శివుడు, పార్వతి ఒకరికి ఒకరు ఎదురుగా ఉంటారు. అందువలన ఈ ఆలయం ప్రేమికులను ఒకటి చేస్తుందని విశ్వసిస్తున్నారు.

మైలం

చెన్నై విళుపురం జాతీయ రహదారి, రైల్వే స్టేషను సమీపంలో ఉన్న మైలం గ్రామంలో ఉన్న కొండమీద ప్రఖ్యాతమైన " మురుగన్ " ఆలయం ఉంది. ఈ ఆలయంలో ప్రతిష్ఠితమై ఉన్న మురుగన్ మనసుకు శాంతి కలిగిస్తాడని ప్రజలు విశ్వసిస్తున్నారు. ఇక్కడ వివాహం జరిపించడం ఒక ప్రత్యేకత. ఇక్కడ అత్యధికంగా వివాహాలు జరుగుతూ ఉంటాయి. ఈ గ్రామం తెన్‌పెయర్ గ్రామం ఉంది.

తెంపెయర్

తెంపేర్ గ్రామం సమీపంలో విక్రవంది నది ప్రవహిస్తుంది. ఈ ఊరిలో ఉన్న కాళియమ్మన్ ఆలయం చాలా ప్రసిద్ధిచెందింది.

కండచ్చిపురం

కండచ్చిపురంలో శ్రీరామ ప్రతిష్ఠితమైన ఇసుకలింగం కలిగిన ఆలయం ఉంది. శ్రీరాముడు అరణ్యవాసం చేసే సమయంలో ఇసుకతో పార్ధివ లింగం చేసి శివారాధన కొనసాగించాడు. ఈ అరణ్యం రామాయణంలో వర్ణించబడింది.

తిరువక్కరై

నదీతీరంలో ఉపస్థితమైన ప్రశాంత గ్రామమైన తిరువక్కరైలో ప్రఖ్యాత వక్కరకాళి అమ్మన్ ఆలయం ఉంది. పౌర్ణమి రోజులలో అమ్మవారిని దర్శించడం ప్రత్యేకత సంతరించుకుంది. భక్తులు ఇక్కడున్న ఫాసిల్ పార్కును సందర్శించి శతాబ్ధాల నుండి జీవిస్తూ శిలారూపం సంతరించుకుంటున్న వృక్షాలను చూసి ఆనందిస్తుంటారు. పౌర్ణమి, సోమవారంతో వచ్చే పాడ్యమి రోజులలో భక్తులు ఈ ఆలయాన్ని విశేషంగా దర్శిస్తుంటారు. ప్రత్యేకంగా చంద్రమౌళీశ్వరుని దర్శించడానికి వస్తుంటారు.

ఆలంబాడి పెరుమాళ్ ఆలయం

ఆలంబాడి పెరుమాళ్ ఆలయానికి కుందుసట్టి పెరుమాళ్ అని మరోపేరు ఉంది. ఈ ఆలయంలో ఉన్న పెరుమాళ్ ఆకారరహితమైన శిలారూపం మాత్రమే ఉంది. అందులో శంఖు, చక్రాలు ఉన్నాయని విశ్వసించబడుతుంది.తిరుమల తిరుపతి వెంకటాచలపతి విగ్రహంలోని భాగమే ఈ శిలారూపమని విశ్వసించబడుతుంది. అందువలన ఈ మూర్తిని ఆరాధించడం తిరుమల తిరుపతి వేంకటనాథుని అర్చించడంతో సమానమని భావిస్తారు.

పెరుంబాక్కం

పెరుంబాక్కం గ్రామం విళుపురానికి 8 కిలోమీటర్లదూరంలో ఉంది. ఇక్కడ శ్రీ యోగ హయవదనర్, వేదంతదేశిఖర్ ఆలయం ఉంది. విళుపురం, తిరుకోయిలూర్ రహదారిలో విళుపురానికి 14 కిలోమీటర్ల దూరంలో ఉన్నమాంబళపట్టు గ్రామంలో శనీశ్వరునికి అతి పెద్ద శిల్పం ఉంది. ఆసియాలోనే ఇది అతిపెద్ద శనీశ్వర విగ్రహంగా విశ్వసిస్తున్నారు.

పూవరసన్ కుప్పం

విళుపురానికి 17 కిలోమీటర్ల దూరంలో ఉన్న పూవరసన్ కుప్పంలో దక్షిణ భారతదేశంలో ప్రఖ్యాతి చెందిన లక్ష్మీనరసింహన్ ఆలయం ఉంది.

సిరువందాడు, మోక్షకుళం

సిరుబందాడు అని పిలువబడుతున్న సిరువందాడు విళుపురానికి 15కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది పట్టునేతకు, పట్టుచీరల తయారీకి ప్రసిద్ధం. రాష్ట్రంలోని పట్టుపరిశ్రమకు ప్రఖ్యాతి చెందిన కాంచీపురం పట్టుపరిశ్రమలో సిరువందాడు ప్రధానపాత్ర వహిస్తుంది. అంతేకాక ఈ గ్రామంలో దక్షిణ భారతదేశంలో ప్రఖ్యాతిచెందిన " లక్ష్మీనారాయణుల " ఆలయం ఉంది. అలాగే ఈ గ్రామంలో మహాశివునికి కూడా ఆలయం ఉంది. గ్రామంలో ఉన్న లక్ష్మీనారాయణుల ఆలయం, శ్రీ అళగేశర్వరాలయం, ద్రౌపది అమ్మన్ ఆలయం పర్యాటక ఆకర్షణగా ఉన్నాయి. ఈ ఆలయాలు సా.శ.పూ 11 వ శతాబ్ధానికి చెందినవి అని భావిస్తారు. గ్రామానికి చిహ్నంగా శ్రీఅయ్యనారప్పన్ ఆలయానికి ముందు ఒక పెద్ద సరస్సు నిర్మితమై ఉంది.[15]

తిరువెన్నైనల్లూరు

విళుపురం తిరుకోయిలూర్ మద్య తిరువెన్నైనల్లూరులో సునదరర్ కాలంనాటి కిరుబపురీశ్వరర్ అనే శివాలయం ఉంది.

కల్పట్టు

కల్పట్టు గ్రామం యోగశనీశ్వరర్ ఆలయానికి ప్రసిద్ధిచెందింది.

తిమ్మలై

తిమ్మలై గ్రామం సేలం, చెన్నై జాతీయ రహదారి సమీపంలో ఉంది. గ్రామంలో వ్యవసాయ ఆధారితమైన పెద్ద సరస్సు సమీపంలో పురాతన శివాలయం ఉంది.

సెంబియన్‌మాదేవి

ప్రఖ్యాత చోళరాణులలో ఒకరైన సెంబియన్ మాదేవి పేరుతో సెంబియన్ మాదేవి అనే ఊరు సేలం చెన్నై జాతీయ రహదారి సమీపంలో ఉంది. ఈ గ్రామంలో చారిత్రాత్మకమైన అమ్మన్ ఆలయం ఉంది.

Remove ads

మూలాలు

వెలుపలి లింకులు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.

Remove ads