సిరివెన్నెల సీతారామశాస్త్రి

సినీ గేయ రచయిత From Wikipedia, the free encyclopedia

సిరివెన్నెల సీతారామశాస్త్రి
Remove ads

సిరివెన్నెల సీతారామశాస్త్రి గా పేరు గాంచిన చేంబోలు సీతారామశాస్త్రి (మే 20, 1955 - నవంబరు 30, 2021) తెలుగు సినీ గీతరచయిత.[1] ఈయన సిరివెన్నెల సినిమాతో సినీరంగ ప్రవేశం చేశారు. 2019లో భారత ప్రభుత్వంచే ప్రదానంచేసే పౌరపురస్కారం పద్మశ్రీ లభించింది.

త్వరిత వాస్తవాలు సీతారామశాస్త్రి, జననం ...
Remove ads

బాల్యం

విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లి మండలంలో 1955 మే 20వ తేదీన శ్రీ డా.సి.వి.యోగి, శ్రీమతి సుబ్బలక్ష్మి గార్లకు జన్మించాడు. శాస్త్రి విద్యాభ్యాసం పదవ తరగతి వరకు అనకాపల్లిలో జరిగింది. కాకినాడలో ఇంటర్మీడియట్ పూర్తిచేసారు. ఆంధ్ర విశ్వకళా పరిషత్లో బి.ఎ పూర్తి చేసి ఎం.ఏ చేస్తుండగా తెలుగు చలనచిత్ర దర్శకుడు కె.విశ్వనాథ్ జననీ జన్మభూమి సినిమాకు[2] పాటలు రాసే అవకాశం కల్పించారు. సిరివెన్నెల సినిమాకు రాసిన విధాత తలపున పాట తో బహుళ ప్రాచుర్యం పొందాడు. 'సిరివెన్నెల' సీతారామశాస్త్రిగా ఆయన పేరు దర్శనమిచ్చింది.

Remove ads

కుటుంబం

సిరివెన్నెల సీతారామశాస్త్రికి భార్య పద్మావతి, ఇద్దరు కుమారులు యెగేశ్వర్ శర్మ, రాజా చెంబోలు ఉన్నారు.[3]

సినిమా పాటల రచయితగా

విధాత తలఁపున ప్రభవించినది... అంటూ ఆయన రాసిన మొదటి పాటే తెలుగు సినీ ప్రేక్షకుల గుండెల్లో ఆయనకు స్థానం సంపాదించి పెట్టంది. భావగర్భితమైన ఈ పాట రాయడానికి తనకు వారంరోజులు పట్టినట్లు సిరివెన్నెల ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ధన మాయను ఎంత చిన్న చిన్న పదాలలో పొదగగలరో దైవ మాయని కూడా అంతే సులువుగా విడమరచి చెప్పగల ప్రజ్ఞాశలి సిరివెన్నెల. సినీ వినీలాకాశంలో ఎన్ని తారలున్నా చల్లని జాబిలి వెలుగులు పంచుతూ తనకంటూ ఒక సుస్థిర స్థానాన్ని ఎప్పుడో ఏర్పరచుకున్న సిరివెన్నెల లలిత గీతాలు రాయడంలో కూడా ఉపద్రష్ఠులు. అసలు ఇది అని ప్రత్యేకంగా చెప్పకుండా తెలుగులో ప్రజనీకానీకి తెలిసిన/తెలియని సాహిత్య ప్రక్రియలన్నింటినీ పలకరించేసారు సిరివెన్నెల. సీతారామశాస్త్రి వై. సత్యారావు తన గురువుగా చెబుతాడు.[2]

Thumb
గోవాలోని పనాజీలో 2017లో ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు, సిరివెన్నెల సీతారామ శాస్త్రికి సంస్కృతికి ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అవార్డును అందజేశారు.

ఆయన కలం నుంచి జాలువారిన అనేక వేల పాటలలో మచ్చుకు కొన్ని గుర్తు చేసుకుంటే:

మరణం

సిరివెన్నెల సీతారామ శాస్త్రి అనారోగ్యంతో బాధపడుతూ సికింద్రాబాద్‌లోని కిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 2021 నవంబరు 30న మరణించాడు.[4]

సినిమాల జాబితా (గేయ రచయితగా)

-

మరింత సమాచారం సంవత్సరం, చిత్రం ...
Remove ads

నటుడిగా

Thumb

ప్రముఖ తెలుగు, హిందీ చలనచిత్ర దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన గాయం తెలుగు సినిమాలో నిగ్గదీసి అడుగు ఈ సిగ్గు లేని జనాన్ని... అని పాట పాడే ప్రభావశీలమయిన పాత్రలో తను వ్రాసి నటించగా,[2] తను వ్రాసిన పాటకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది[2] పురస్కారం లభించటం విశేషం.



పురస్కారాలు

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ నంది పురస్కారాలు, ఉత్తమ గేయ రచయితగా :

దక్షిణాది ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు, ఉత్తమ గేయరచయితగా :

కళాసాగర్ పురస్కారాలు, ఉత్తమ గేయ రచయితగా :

  • 1986 - సిరివెన్నెల- విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం
  • 1992 - అంకురం - ఎవరో ఒకరు ఎపుడో అపుడు నడవరా ముందుగా అటో ఇటో ఎటోవైపు
  • 1994 - శుభలగ్నం - చిలకా ఏ తోడులేక ఎటేపమ్మా ఒంటరి నడక
  • 1995 - పెళ్ళి సందడి - హృదయమనే కోవెల తలుపులు తెరిచే తాళం ప్రేమా ప్రేమా

మనస్విని పురస్కారాలు, ఉత్తమ గేయ రచయితగా :

కిన్నెర పురస్కారాలు, ఉత్తమ గేయ రచయితగా :

  • 1998 - మనసులో మాట - ఏరాగముంది మేలుకుని ఉండి లేవనంటుందా మనసుని పిలవగా

భరతముని పురస్కారాలు, ఉత్తమ గేయ రచయితగా :

  • 1992 - సిరివెన్నెల- విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం
  • 1996 - పవిత్రబంధం - అపురూపమైనదమ్మ ఆడజన్మ - ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మ
  • 1999 - భారతరత్న - మేరా భారత్ కో సలాం! ప్యారా భారత్ కో ప్రణాం!

అఫ్జా పురస్కారాలు, ఉత్తమ గేయ రచయితగా :

  • 1999 - భారతరత్న - పారా హుషార్ భాయీ భద్రం సుమా సిపాయీ
  • 2000 - నువ్వు వస్తావని - పాటల పల్లకివై ఊరేగే చిరుగాలీ కంటికి కనపడవే నిన్నెక్కడ వెతకాలి

వంశీ బర్ఖిలీ పురస్కారాలు, ఉత్తమ గేయ రచయితగా :

  • 2000 - నువ్వే కావాలి సినిమా గేయ రచయితగా :
  • కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడవెందుకు చెప్పలేని గుండెకోత పోల్చుకొందుకు
  • అనగనగా ఆకాశం వుంది - ఆకాశంలో మేఘం ఉంది
  • ఎక్కడ వున్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది చెలీ ఇదేం అల్లరి

రసమయి పురస్కారం, ఉత్తమ గేయ రచయితగా :

  • 1988 - కళ్ళు - తెల్లారింది లెగండోయ్ కొక్క్కొరొక్కొ, మంచాలింక దింగండోయ్ కొక్క్కొరొక్కొ

బుల్లి తెర పురస్కారం, ఉత్తమ గేయ రచయితగా :

  • 1999 - తులసి దళం, టి.వి. సీరియల్ - హాయిగా వుంది, నిదురపో

సాక్షి ఎక్సలెన్స్ పురస్కారాలు

  • 2021 - లైఫ్‌ టైమ్‌ ఎఛివ్‌మెంట్‌ అవార్డు (మరణానంతరం)[10]

సైమా అవార్డులు: ఉత్తమ గీత రచయిత

  • 2015: "ఇటు ఇటు ఇటు" (కంచె)
Remove ads

బయటి లింకులు

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.

Remove ads