ఐతరేయ బ్రాహ్మణం (సంస్కృతం: ऐतरेय ब्राह्मण) బ్రాహ్మణాలలో ఒకటి. ఇది ఋగ్వేద శాఖకి చెందినది. ఈ బ్రాహ్మణం సంప్రదాయం ప్రకారం మహీదాస ఐతరేయుడు నకు సంబంధించింది.[1][2]

త్వరిత వాస్తవాలు వేదములు (శ్రుతులు), వేదభాగాలు ...
ఈ వ్యాసానికి సంబంధించిన రచనలు
హిందూధర్మశాస్త్రాలు
aum symbol
వేదములు (శ్రుతులు)
ఋగ్వేదం · యజుర్వేదం
సామవేదము · అధర్వణవేదము
వేదభాగాలు
సంహిత · బ్రాహ్మణము
అరణ్యకము  · ఉపనిషత్తులు
ఉపనిషత్తులు
ఐతరేయ  · బృహదారణ్యక
ఈశ  · తైత్తిరీయ · ఛాందోగ్య
కఠ  · కేన  · ముండక
మాండూక్య  ·ప్రశ్న
శ్వేతాశ్వర
వేదాంగములు (సూత్రములు)
శిక్ష · ఛందస్సు
వ్యాకరణము · నిరుక్తము
జ్యోతిషము · కల్పము
స్మృతులు
ఇతిహాసములు
మహాభారతము · రామాయణము
పురాణములు
ధర్మశాస్త్రములు
ఆగమములు
శైవ · వైఖానసము ·పాంచరాత్రము
దర్శనములు
సాంఖ్య · యోగ
వైశేషిక · న్యాయ
పూర్వమీమాంస · ఉత్తరమీమాంస
ఇతర గ్రంథాలు
భగవద్గీత · భాగవతం
విష్ణు సహస్రనామ స్తోత్రము · త్రిమతాలు
లలితా సహస్రనామ స్తోత్రము · శక్తిపీఠాలు
శివ సహస్రనామ స్తోత్రము
త్రిమూర్తులు · తిరుమల తిరుపతి
పండుగలు · పుణ్యక్షేత్రాలు
... · ...
ఇంకా చూడండి
మూస:హిందూ మతము § వర్గం:హిందూమతం
మూసివేయి

బ్రాహ్మణాలు నిర్వచనము

  • బ్రాహ్మణాలు, లో పురాణాలు, తత్వశాస్త్రం, వేదాల ఆచారాలు గురించి వ్యాఖ్యానాలు ఉంటాయి. వేదసంహితలు తదుపరి మహోన్నత స్థానం బ్రాహ్మణాలు కలిగి ఉన్నాయి. ఇవి వేదాలలోని అంతర్భాము. చతుర్వేదాలలోని సంహిత (శ్లోక, మంత్ర) భాగములకు బ్రహ్మ పదాన్ని, వ్యాఖ్యాన రూపంగా ఉన్నదానికి బ్రాహ్మణం అని చెప్పబడు తున్నది. ఈ నాలుగు వేదాలలో గల మంత్రాలను, ఎక్కడెక్కడ, ఏఏ యజ్ఞములకు ఈ మంత్రాలను ఎలా వినియోగించాలి, ఆయా వాటిని అవసరమైన చోట వ్యాఖ్యానిస్తూ ఉన్నటువంటి గ్రంథాలకు బ్రాహ్మణాలు అని అంటారు. బ్రాహ్మణాల గ్రంథాలందు సంహితలలోని శ్లోకాల నిగూఢ అర్థాన్ని చెబుతూ అనేక వివరణలతో పాటుగా, ఉపాఖ్యానలు కూడా తెలియజేస్తాయి.[3]

ఐతరేయ మహర్షి (ఐతరేయుడు) చరిత్ర

  • ఐతరేయము అనగా ఇతరము అని అర్ధము. పూర్వము ఎంతో మంది భార్యలు కలిగి ఉన్న కాత్యాయనుడికి "'ఇతర"' అనే పేరు గల భార్య ( మొదటి భార్య కాదు) కూడా ఉంది. వీరిద్దరి కుమారుడు మహీదాస ఐతరేయుడు.

విభాగము

  • ఐతరేయ బ్రాహ్మణంలో 40 అధ్యాయాలు ఉన్నాయి. ఈ అధ్యాయాలు తిరిగి ఖండాలు గా విభజింపబడ్డాయి. ఐదు అధ్యాయాలను పంచిక అని అంటారు. ఈ బ్రాహ్మణం ఎనిమిది పంచికలుగా విభజింపబడింది. ఈ క్రింద సూచించిన పట్టిక ద్వారా వాటికి సంబంధించిన విషయాలను తెలియజేస్తుంది.[4]

అష్టక విభాగం

సంచికలుఅధ్యాయాలుఖండాలుసంచికలుఅధ్యాయాలుఖండాలు
I16V215
252210
36234
49246
54259
మొత్తం:30మొత్తం:34
II610VI263
78275
86288
982910
1093010
మొత్తం:41మొత్తం:36
III1111VII311
12133211
1314336
146348
156358
మొత్తం:50మొత్తం:34
IV166VIII364
178377
188383
196399
204405
మొత్తం:32మొత్తం:28
మొత్తం ఖండాలు153 +మొత్తం ఖండాలు132 = 285

బ్రాహ్మణాలు (ఋక్సంహిత)

  • సంహిత యొక్క ప్రతి ప్రధాన శాఖకు ఒక బ్రాహ్మణం ఉండాలి/ఉండేది.
  • ఋక్సంహితకు 21 శాఖలు ఉన్నట్లుగా తెలియుచున్నది. ఆ విధముగా 21 బ్రాహ్మణాలు తప్పకుండా ఉండాలి.
  • ఋగ్వేదానికి కౌషీతకి బ్రాహ్మణం, ఐతరేయ బ్రాహ్మణం, అశ్వలాయన బ్రాహ్మణం గాలవ బ్రాహ్మణం బహ్వృచ బ్రాహ్మణం పైంగి బ్రాహ్మణం అని ఆరు బ్రాహ్మణములు మాత్రమే దృశ్యించినారని తెలుస్తున్నది.
  • ఈ ఆరింటిలోనూ, ప్రస్తుతము ఐతరేయ బ్రాహ్మణం, కౌషీతకి బ్రాహ్మణం అను రెండు బ్రాహ్మణములు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మిగతావన్నీ చరిత్రలో కలసి పోయి నామమాత్రంగానే మిగిలిపోయాయి.
  • ఐతరేయ బ్రాహ్మణాన్ని బహ్వృచ బ్రాహ్మణం అని కూడా కొందరి వాదన, అభిప్రాయము ఉంది.[3]

ఇవి కూడా చూడండి

బయటి లింకులు

మూలాలు

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.