జైపూర్ (రాజస్థాన్)
From Wikipedia, the free encyclopedia
జైపూర్ పేరుతో ఇతర వ్యాసాలున్నాయి. వాటి లింకుల కోసం జైపూర్ (అయోమయ నివృత్తి) చూడండి.
?జైపూర్ రాజస్థాన్ • భారతదేశం | |
అక్షాంశరేఖాంశాలు: 26.9260°N 75.8235°E / 26.9260; 75.8235 | |
కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
విస్తీర్ణం • ఎత్తు |
200.4 కి.మీ² (77 sq mi) • 431 మీ (1,414 అడుగులు) |
జిల్లా (లు) | జైపూర్ జిల్లా |
జనాభా • జనసాంద్రత |
33,24,319 (2005 నాటికి) • 16,588/కి.మీ² (42,963/చ.మై) |
Mayor | Ashok Parnami |
కోడులు • పిన్కోడ్ • ప్రాంతీయ ఫోన్ కోడ్ • UN/LOCODE • వాహనం |
• 3020 xx • +0141 • INJAI • RJ-14 |
జైపూర్, ఈ నగరం "గులాబీ నగరం"గా ప్రసిద్ధి. రాజస్థాన్ రాజధాని. 1727లో మహారాజా సవాయి జైసింగ్ నిర్మించాడు. ఈ నగర జనాభా దాదాపు 30 లక్షలు.
జైపూర్ భారతదేశంలో చక్కని ప్రళాళికతో రూపొందించిన నగరాలలో ఒకటి. రాజస్థాన్ లోని అర్ధఎడారి భూమిలో ప్రాంతంలో ఉపస్థితమైన నగరం. ఒకప్పుడు రాజరిక పాలనలోని రాజ్యాలకు రాజధానిగా ఉన్న ఈ నగరం ప్రస్తుతం రాజస్థాన్ రాష్ట్ర రాజధానిగా ఉంది. రాజస్థాన్ నగర నిర్మాణ శైలి రాజపుత్రుల రాజరిక అభిరుచికి తగిన విధంగా ఉంటుంది. ప్రస్తుత జైపూరు నగరం మహానగరానికి ఉన్న సకల వసతులను కలిగి వాణిజ్యానికి అనుకూలంగా ఉండి ప్రఖ్యాత వ్యాపార కూడలిగా ఉంది. అధునిక నగరాల నిర్మాణానికి ముందే అభివృద్ధి చెంది ఉన్న భారతీయ నగరాలలో జైపూర్ ప్రత్యేకత కలిగి ఉంది. రాజస్థాన్ నగరం 111 అడుగుల (34 మీటర్ల) రహదార్లతో ఆరు విభాగాలుగా విభజింపబడి రాజగంభీరంగా ఉంటుంది. నగరశివారు ప్రాంతాలు చక్కని రహదార్లతో నగరంతో అనుసంధానించబడి ఉంటుంది. మధ్యలో ఆరవ భాగంలో రాజమహల్ నాలుగు వైపులా నానుగు భాగాలు. ఆరవభాగం తూర్పు దిశగా విస్తరించి ఉంటుంది. పేలస్ విభాగం రాజసౌధాలను (హవా మహల్) అనుకుని ఉంటుంది. సాధారణ పూల తోటలు, చిన్న సరస్సు నహర్ ఘడ్ దుర్గ్ ఇది సవాయి జై సింఘ్ II వివాస స్థలంగా ఉంటూ వచ్చింది. జైపూర్ లోని జంతర్ మంతర్ ప్రపంచ వారసత్వ ప్రదేశాలలో ఒకటి. భారతదేశంలో జైపూర్ ప్రసిద్ధ పర్యాటక కేంద్రం.