సంగీత దర్శకుడు From Wikipedia, the free encyclopedia
కీరవాణి గా పేరు గాంచిన కోడూరి మరకతమణి కీరవాణి తెలుగు చలనచిత్ర సంగీత దర్శకుడు, గాయకుడు.[1] తెలుగులో సినీ రంగంలో ఎం. ఎం. కీరవాణిగా, తమిళంలో మరకతమణిగా, హిందీలో ఎం. ఎం. క్రీమ్ గా ప్రసిద్ధుడు.[2] తొలినాళ్లలో రాజమణి, చక్రవర్తి వంటి సంగీత దర్శకుల వద్ద సహాయకునిగా పనిచేసాడు. సినిమా నిర్మాణ సంస్థ ఉషా కిరణ్ మూవీస్ వారు 1989లో నిర్మించిన మనసు - మమత తెలుగు చిత్రం ద్వారా ఎం. ఎం. కీరవాణి తెరనామంతో సంగీత దర్శకునిగా వెండి తెరకు పరిచయమయ్యాడు. అప్పటినుండి తెలుగు, తమిళ, హిందీ భాషలలో నూరు వరకూ చిత్రాలకు సంగీతాన్ని అందించాడు. 1997లో వచ్చిన అన్నమయ్య చిత్రానికి గాను జాతీయస్థాయిలో ఉత్తమ సంగీతదర్శకునిగా పురస్కారాన్ని అందుకున్నాడు.
కీరవాణి | |
---|---|
జననం | కోడూరి మరకతమణి కీరవాణి 1961 జూలై 4 |
ఇతర పేర్లు | ఎం. ఎం. కీరవాణి, మరకతమణిగా, ఎం. ఎం. క్రీమ్ |
వృత్తి | సంగీత దర్శకుడు, గాయకుడు, రచయిత |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | తెలుగు చలనచిత్ర సంగీతదర్శకుడు , గాయకుడు |
జీవిత భాగస్వామి | శ్రీవల్లి |
పిల్లలు | శ్రీ సింహాతో సహా ఇద్దరు కుమారులు |
తల్లిదండ్రులు |
|
కీరవాణి సంగీతం సమకూర్చిన సినిమాలలో చెప్పుకోదగినవి సీతారామయ్యగారి మనవరాలు, క్షణ క్షణం, అల్లరి మొగుడు, మేజర్ చంద్రకాంత్, అల్లరి ప్రియుడు, అన్నమయ్య, శ్రీరామదాసు, నేనున్నాను, స్టూడెంట్ నంబర్ 1, ఛత్రపతి, సింహాద్రి, అనుకోకుండా ఒక రోజు, ఆపద్బాంధవుడు, శుభ సంకల్పం, పెళ్ళి సందడి, సుందరకాండ.
కీరవాణి కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన 25 చిత్రాలకు పైగా సంగీత దర్శకత్వం వహించాడు.
గోల్డెన్ గ్లోబ్ అవార్డ్-2023 లో ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వం వహించిన రౌద్రం రణం రుధిరం (2022) కి రెండు నామినేషన్లు దక్కాయి. ఉత్తమ ఆంగ్లేతర చిత్రం విభాగంలోనూ, ఎం. ఎం. కీరవాణి స్వరపరిచిన ‘నాటు నాటు...’ పాటకిగానూ ఒరిజినల్ సాంగ్ విభాగంలోనూ ఈ చిత్రం నామినేట్ అయ్యింది.[3]
రౌద్రం రణం రుధిరం (2022) చిత్ర సంగీత దర్శకుడు కీరవాణి కి ‘నాటు నాటు’ పాటకు ఒరిజినల్ పాట విభాగంలో గోల్డెన్ గ్లోబ్ అవార్డ్-2023 లభించింది. [4][5]
2023 సంవత్సరం కు గాను కేంద్రం ప్రకటించిన పద్మ అవార్డుల్లో ఈ సంగీత దర్శకుడిని పద్మశ్రీ పురస్కారం వరించింది.[6][7]
ఎం. ఎం. కీరవాణి సంగీతాన్ని సమకూర్చిన ‘నాటు నాటు’ పాట, 13 మార్చ్ 2023 న ఉత్తమ ఒరిజినల్ పాట గా ఆస్కార్ అవార్డు గెలుచుకుంది.[8] [9]
69వ జాతీయ చలనచిత్ర అవార్డ్స్‌లో ఆర్ఆర్ఆర్ (2021) సినిమాకు ఉత్తమ నేపథ్య సంగీత దర్శకుడు విభాగంలో జాతీయ ఉత్తమ నుపథ్య సంగీత దర్శకుడుగా జాతీయ అవార్డుకు ఎంపికయ్యాడు.[10]
కీరవాణి 1961 జూలై 4న జన్మించాడు. ఈయన తండ్రి శివశక్తి దత్తా. కీరవాణి భార్య శ్రీవల్లి. ఈ దంపతులకు ఇద్దరు అబ్బాయిలు. సినీ దర్శకుడు రాజమౌళికి ఈయన వరసకి అన్న అవుతాడు. రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ కీరవాణి చిన్నాన్న.
ఈయన మొదటి సినిమా రామోజీ రావు నిర్మించిన మనసు మమత అనే చిత్రం. తర్వాత అదే సంస్థలో పీపుల్స్ ఎన్ కౌంటర్, అమ్మ, అశ్విని తదిరత చిత్రాలకు పనిచేశాడు. రాం గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన క్షణక్షణం ఆయనకు మంచి బ్రేక్ నిచ్చింది. తర్వాత కె. రాఘవేంద్రరావుతో 27కి పైగా సినిమాలు చేశాడు. తర్వాత రాజమౌళి దర్శకుడిగా వచ్చిన అన్ని సినిమాలకు ఆయనే సంగీత దర్శకత్వం వహించాడు.
చిత్రం | పాటలు |
సీతారామయ్యగారి మనవరాలు | "కలికి చిలకల కొలికి", "పూసింది పూసింది పున్నాగ" |
క్షణక్షణం | "జామురాతిరి జాబిలమ్మా", "చలి చంపుతున్న చమక్కులో" |
సుందరకాండ | "నవ్వవే నవమల్లిక", "అరె మామ ఇల్లలికి పండగ చేసుకుందామా", "ఉలికి పడకు కుకుకుకు" |
అంతం | "గుండెల్లో దడ దడలాడే" |
క్రిమినల్ | "తెలుసా మనసా", "హల్లో గురూ" |
అల్లరి అల్లుడు | "నిన్ను రోడ్డు మీద చూసినది లగాయతు" |
రక్షణ | "ఘల్లుమంది బాసు గలాసు" |
అన్నమయ్య | "ఏలే ఏలే మరదలా", "తెలుగు పదానికి" (ఈ చిత్రంలోని చాలా పాటలు అన్నమాచార్య స్వరపరచిన కీర్తనలు) |
శ్రీరామదాసు | "చాలు చాలు చాలు" (ఈ చిత్రంలోని చాలా పాటలు రామదాసు స్వరపరచిన కీర్తనలు) |
నేనున్నాను | "ఏ శ్వాసలో చేరితే", "చీకటితో వెలుగే చెప్పెను నేనున్నాని", "శీతాకాలం ఎండల్లాగ" |
ఆపద్బాంధవుడు | "ఔరా అమ్మకచల్ల", "చుక్కల్లారా, చూపుల్లారా, ఎక్కడమ్మా జాబిలి" |
ఘరానా మొగుడు | "బంగారు కోడిపెట్ట", "ఏందిబే ఎట్టాగ ఉంది ఒళ్లు" |
శుభసంకల్పం | "హరిపాదాన పుట్టావేమో గంగమ్మా", "హైలెస్సో హైలెస్స", "సీతమ్మ అందాలు" |
మాతృదేవోభవ | "రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే" |
మొండి మొగుడు-పెంకి పెళ్లాం | "నాటకాల జగతిలో జాతకాల జావళి", "లాలూ దర్వాజ లష్కర్" |
అన్న | "గురుగురు పిట్ట గోగుల గుట్ట మీద" |
ఖతర్నాక్ | "లవ్వు చేసే వాళ్లకేమో కోలాటం" |
అల్లరి బుల్లోడు | "త్రిషా, అసలు సిసలు తళుకులొలుకు రూపమా" |
ఒకరికి ఒకరు | "ధిరననన ధిరననన ధిరనననా" |
ఒక్కడున్నాడు | "అడుగడుగున", "ఇవ్వాళ నా గెలుపు" |
అనుకోకుండా ఒక రోజు | "ఐ వన్నా సింగ్", "ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని", "నీడల్లే తరుముతూ ఉంది గతమేదో వెంటాడి" |
స్టూడెంట్ నంబర్ 1 | "ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి", "పడ్డానండీ ప్రేమలో మరి" |
సింహాద్రి | "చిరాకు అనుకో పరాకు అనుకో", "ఏదేదో చెయ్యమాక సందెకాడ" |
సై | "నల్లా నల్లాని కళ్ల పిల్లా" |
ఛత్రపతి | "గుండు సూదీ గుండు సూదీ", "మన్నేలదింటివిరా కృష్ణా", "ఎ వచ్చి బి పై వాలె" |
విక్రమార్కుడు | "కాలేజి పాపల బస్సు", "వస్తవా వస్తవా ఒక్కసారి వస్తవా", "డమ్మారె డమ్మ డమ్మ" |
యమదొంగ | "రబ్బరు గాజులు", "యంగ్ యమా" |
రాజహంస | "రోసా రోసా రోసా" |
పెళ్లిసందడి | "నవ మన్మధుడా అతి సుందరుడా", "మా పెరటి జాంచెట్టు పళ్లన్నీ కుశలం అడిగె", "సౌందర్యలహరి స్వప్నసుందరి" |
పరదేశి | "చందన చర్చిత" |
బొంబాయి ప్రియుడు | "పరువమా మరుమల్లె పూలతోటలో ఘుమఘుమా", "రాజ్ కపూర్ సినిమాలోని హీరోయిన్లా ఉంది ఫిగరు" |
అల్లరి మొగుడు | "నా పాట పంచామృతం", "బాత్ టబ్ షవరులో కాలుజారి పడ్డవేళ" |
అల్లరి ప్రియుడు | "రోజ్ రోజ్ రోజ్ రోజ్ రోజా పువ్వా", "ఉత్తరాల ఊర్వశి ప్రేమలేఖ ప్రేయసి" |
మనీ | "చక్రవర్తికీ వీధి బిచ్చగత్తెకీ" |
పాతబస్తీ | "వేటూరి పాట వేగం, సాలూరి వారి రాగం" |
అకాడమీ అవార్డ్స్ :
జాతీయ చలన చిత్ర అవార్డులు :
దక్షిణాది ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు :
Tamil Nadu State Film Awards:
Other awards:
ఆస్కార్ పురస్కారాన్ని గెలుచుకున్నఅనంతరం కీరవాణి, చంద్రబోస్‌లను 2023 ఏప్రిల్ 09న హైదరాబాద్‌లోని శిల్పా కళావేదికలో తెలుగు నిర్మాతల మండలి, ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలంగాణ ప్రభుత్వం తరపున రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, వి. శ్రీనివాస్ గౌడ్, ఎఫ్డీసీ ఛైర్మన్ అనిల్ కుర్మాచలం సన్మానించారు.[15][16]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.