మేంగనీస్

From Wikipedia, the free encyclopedia

మేంగనీస్
Remove ads

మేంగనీస్ Mn అనే చిహ్నం, 25 పరమాణు సంఖ్య గల రసాయన మూలకం. తరచుగా ఇనుము ధాతువుతో కలిసి లభిస్తుంది. దీనిని పరిశ్రమలలో వివిధ రకాలుగా, ప్రత్యేకంగా స్టెయిన్లెస్ స్టీల్ ఉత్పత్తిలో వాడతారు.

త్వరిత వాస్తవాలు మాంగనీస్, Pronunciation ...

1774 లో తొలిసారి వేరుపరచిన తర్వాత, ఉక్కు ఉత్పత్తిలో ప్రధానంగా వాడారు. ముదురు వంగపండు రంగులో వుండే పొటాసియం పర్మాంగనేట్ అనే లవణం రూపంలో ప్రయోగశాలవారికి పరిచితం. కొన్ని ఎంజైములలో కూడా వుంటుంది.[3] మొక్కలు ఆక్సిజన్ ఉత్పత్తిలో "Mn-O" అనే రూపంలో కూడా దీని పాత్ర ఉంది.

Remove ads

పేరు

మేంగనీసు, మెగ్నీసియం - ఈ రెండు పేర్లలోను ఉన్న పోలిక వల్ల ఒకదానికొకటి అనుకుని పొరపడే సావకాశం ఉంది. పూర్వం ఈ రెండింటితోపాటు ఇనప ఖనిజం మేగ్నటైట్ గ్రీసు దేశంలోని మెగ్నీసియా అనే ప్రాంతంలో దొరికేవి కనుక ఈ పేర్లలో పోలిక అలా వచ్చింది.

ఆవర్తన పట్టికలో

మేంగనీస్‌ ఆవర్తన పట్టికలో, 4 వ పీరియడ్‌లో, అణుసంఖ్య 21 నుండి 30 వరకు ఉన్న అంతర్యాన లోహాల (transition metals) వరుసలో మధ్యస్థంగా ఉంది. దీని అణుసంఖ్య 25. దీని ఎడం పక్క గదిలో క్రోమియం, కుడి పక్క ఇనుము ఉన్నాయి. కనుక ఇనిము లాగే దీనికీ తుప్పు పట్టే గుణం ఉంది. పూర్వపు రోజులలో దీని దిగువన ఉన్న గది ఖాళీగా ఉంటే ఆ ఖాళీ గదికి "ఏక మేంగనీస్" అని పేరు పెట్టేరు మెండలియెవ్. తరువాత ఆ ఖాళీ గదిలో టెక్నీటియం ఉండాలని నిర్ధారణ చేసేరు. మేంగనీస్‌ సమస్థానులు (ఐసోటోపులు) లో ముఖ్యమైనది 55Mn.

దీని అణువులో స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న d-ఎలక్‌ట్రానులు (free electrons in d-orbital) 5 ఉన్నాయి కనుక ఇది చురుకైన మూలకమే! ఉక్కు తయారీలో మేంగనీస్‌ కీలకమైన పాత్ర వహిస్తోంది.

Remove ads

పరిశ్రమలలో

  • మేంగనీస్ పాలు 1.5 శాతం ఉన్న అల్లూమినం తుప్పు పట్టదు కనుక కలిపితే అటువంటి అల్లూమినంని కోకాకోలా, బీరు వంటి పానీయాలని అమ్మడానికి వినియోగొస్తారు.
  • మేంగనీస్ డైఆక్సైడ్ (మంగన భస్మం) పొడి బేటరీల రుణ ధ్రువాల (కేథోడ్‌ల) తయారీలో వాడతారు.
  • మేంగనీస్‌తో కలిసిన మిశ్రమ ధాతువులు ("కాంపౌండ్"లు) గాజు సామానులకి రంగులద్దడంలో విరివిగా వాడతారు.
  • ముడి చమురులో ఉండే జైలీన్ (Xylene) ని ఆమ్లజని సమక్షంలో భస్మీకరించినప్పుడు మేంగనీస్‌ని కేటలిస్ట్‌గా వాడతారు. ఈ ప్రక్రియ ప్లేస్టిక్‌ నీళ్ళ సీసాలు తయారు చేసే పరిశ్రమలో విరివిగా వాడతారు.

పోషక విలువ

  • అతి చిన్న మోతాదులలో మేంగనీస్ అత్యవసరమైన పోషక పదార్థం. మోతాదు మించితే విషం.
  • ఎదిగిన యువకుడుకి, రోజుకి 2.3 మిల్లీగ్రాముల మేంగనీస్ అవసరం ఉంటుంది.
  • ఇది శరీరంలోని ఎంజైములు (కేటలిస్టులు) సరిగ్గా పని చెయ్యడానికి అత్యవసరం.
  • ఆకుకూరలు, పళ్లు, గింజలు, దినుసులలో మేంగనీస్‌ లభిస్తుంది కాని ఇనుము, ఖటికము, మెగ్నీసియం మోతాదు మించి తింటే తిన్న మేంగనీస్‌ ఒంటబట్టదు. అందుకనే మంచి చేస్తుంది కదా ఏ పదార్థాన్ని అతిగా తినకూడదు.
Remove ads

వైద్యంలో

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.

Remove ads