సీసియం
From Wikipedia, the free encyclopedia
Remove ads
సీసియం (Caesium) ఒక రసాయన మూలకము. దీని సంకేతం Cs. పరమాణు సంఖ్య 55. ఇది మెత్తగా, వెండి-బంగారు వర్ణంలో ఉంటే క్షార లోహం (alkali metal). దీని ద్రవీభవన స్థానం 28 °C (83 °F), అనగా సామాన్య ఉష్ణోగ్రత వద్ద ద్రవరూపంలో ఉండే ఐదు ద్రవలోహాలలో ఇది ఒకటి.[6] సీజియం పదార్ధాలను అణు గడియారాలలో (atomic clocks వాడుతారు,.
ఆంగ్లంలో సీజియాన్ని రెండు స్పెల్లింగులతో వ్రాస్తారు. Caesium అని IUPAC ప్రామాణికరించింది. కాని అమెరికాలో cesium అనే స్పెల్లింగు అధికం[7]
సీసియం ఎమిషన్ స్పెక్ట్రమ్ (emission spectrum) లో రెండు నీలి రంగు భాగంలో రెండు ప్రకాశవంతమైన లైనులు, ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగుల భాగంలో మరి కొన్ని లైనులు ఉంటాయి. ఇది వెండి-బంగారు (silvery gold) రంగులో ఉంటుంది. ఇది మెత్తనిది, సాగదీయడానికి వీలయినది కూడాను (both soft and ductile). అన్ని రసాయన మూలకాలలోను సీసియం అతి తక్కువ అయొనైజేషన్ పొటెన్షియల్ (ionization potential) కలిగి ఉంది.
రేడియో ధార్మికత లేని ఐదు క్షార లోహాలలోను సీసియం భూమిలో అతి తక్కువగా లభించే లోహం. (అన్నింటి కంటే ఫ్రాన్సియం అత్యంత అరుదైనది. ఎందుకంటే ఫ్రాన్సియం చాలా ఎక్కువ రేడియో ధార్మికత కల లోహం కనుక త్వరగా తరిగిపోతుంది. మొత్తం భూగర్భంలో కేవలం 30 గ్రాముల ఫ్రాన్సియం ఉండవచ్చునని ఒకప్పటి అంచనా.[8] అందుచేత వాస్తవంగా ఫ్రాన్సియం "దాదాపు అసలు లేదు" అనవచ్చును.).
సీజియం హైడ్రాక్సైడ్ (Caesium hydroxide - CsOH) చాలా బలమైన క్షారం. ఇది గాజు తలాన్ని చాలా త్వరగా తినేస్తుంది. అందువలన CsOH అనే పదార్థం "strongest base" అనుకొంటారు. కాని నిజానికి n-butyllithium, sodium amide లాంటివి ఇంకా బలమైన base పదార్ధాలు .
ప్రస్తుతం అధికంగా సీజియం వినియోగం ఆయిల్ పరిశ్రమలో ఉంది. సీజియం ఫార్మేట్‌తో తయారైన ఒక ద్రవాన్ని డ్రిల్లింగ్ ఫ్లూయిడ్‌గా వాడుతారు.[9][10]
ఇంకా సీజియాన్ని పరమాణు గడియారాలలో (atomic clocks) వాడుతారు. ఈ రకమైన గడియారాలో వేల సంవత్సరాల వ్యవధిలో టైము తేడా కొద్ది సెకండ్లలోపే ఉంటుంది. 1967 మయండి అంతర్జాతీయ కొలమాన విధానం (International System of Measurements) వారి ప్రామాణిక సమయం సీజియం లక్షణాలపైనే ఆధాఱపడి ఉంది. SI నిర్వచనం ప్రకారం ఒక సెకండు అనగా 9,192,631,770 సైకిల్స్ రేడియేషన్ - ఇది 133Cs పరమాణువు యొక్క రెండు హైపర్ ఫైన్ ఎనర్జీ లెవెల్స్కు చెందిన గ్రౌండ్ స్టేట్‌ల మధ్య ట్రాన్సిషన్ కాలానికి సమానం.
Remove ads
ఇవి కూడా చూడండి
మూలాలు
బయటి లింకులు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads