ఐన్‌స్టయినియం

From Wikipedia, the free encyclopedia

ఐన్‌స్టయినియం
Remove ads

ఈ రసాయన మూలకం పేరుని జెర్మనీ భాషలో ఉచ్చరిస్తే ఐన్‌ష్టయినియం అని పలకాలి. ఇంగ్లీషులో ష కారానికి బదులు స కారం వాడుతారు. కనుక తెలుగులో ఐన్‌స్టయినియం అంటే బాగుంటుంది. ఐ తరువార పూర్నానుస్వారం పెట్టి తరువాత స, ట, ఐ కలిపి ఒకే అక్ష్రరంగా రాయడంలో సదుపాయం లేదు.

త్వరిత వాస్తవాలు ఐన్‌స్టీనియం, Pronunciation ...


ఐన్‌స్టయినియం (Einsteinium) ఒక రసాయన మూలకం. రసాయన హ్రస్వ నామం Es. అణు సంఖ్య 99, అనగా ఈ మూలకం అణువులో 99 ప్రోటానులు ఉంటాయి. అణుభారం 252. ఈ మూలకాన్ని ఐన్‌స్టయిన్ కనిపెట్టలేదు; ఆయన చేసిన పనికీ ఈ మూలకం ఉనికికీ ఏ విధమైన సంబంధం లేదు. శాస్త్రవేత్తల పేర్లు పెడితే బాగుంటుంది కదా అని ఒకరికి ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనని ఆచరణలో పెడుతూ పెట్టిన పేర్లలో ఫెర్మియం ఒకటి, ఇది మరొకటి.

అమెరికా 1952లో మొట్టమొదటి హైడ్రొజన్ బాంబు ప్రయోగాత్మకంగా పేల్చినప్పుడు మిగిలిన శిధిలావశేషాలలో ఈ కొత్త మూలకం దొరికింది. ఈ మూలకం ప్రకృతి సిద్ధంగా దొరకదు. ఈ మూలకం సమస్థానులు లో ఎక్కువ తరచుగా కనిపించేది ఐన్‌స్టయినియం-253. ఈ సమస్థానులు అన్నీ వికిరణ ఉత్తేజిత లక్షణాలు ప్రదర్శిస్తాయి. దీని అర్థాయుర్దాయం 20.47 రోజులు. ఈ కారణాల చేత ఈ మూలకానికి ఇంతవరకు ఏ ఉపయోగాలూ ఉన్నట్లు లేదు.

ఐన్‌స్టయినియం మెత్తటి వెండిలా ఉంటుంది. చీకటిలో నీలి రంగుతో ప్రకాసిస్తుంది. ఇది ఆవర్తన పట్టికలో కేలిఫోర్నియం కి కుడి పక్కనా, ఫెర్మియం కి ఎడమ పక్కనా, హోల్మియం కి దిగువనా ఉంటుంది.

Remove ads
Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.

Remove ads