యిట్రియం

From Wikipedia, the free encyclopedia

యిట్రియం
Remove ads

యిట్రియం (Yttrium) ఒక మూలకము. దీని సంకేతం Y, పరమాణుసంఖ్య 39. ఇది పరివర్తన లోహం. ఆవర్తన పట్టికలో d బ్లాకుకు చెందుతుంది. ఇది రసాయనికంగా లాంథనైడ్ల లాంటి ధర్మాలు కలిగి ఉంటుంది. దీనిని "విరళ మృత్తిక మూలకం"గా వర్గీకరించారు.[5] ఈ మూలకం ఎల్లప్పుడూ అరుదైన భూ ఖనిజాలలో లాంథనైడ్ల మూలకాలతో కలసి లభ్యమవుతుంది. ఇది ప్రకృతిలో మూలక రూపంలో లభ్యం కాదు. దీని ఏకైక స్థిరమైన ఐసోటోపు 89Y. ఈ ఐసోటోపు భూ పటలంలో లభ్యమవుతుంది. ఈ మూలకం అంత అరుదైన (విరళ) మూలకాలు కాదు కాని ఆ పేరు అలా స్థిరపడిపోయింది; దీని బజారు ధర 1 గ్రాము 1 అమెరికా డాలరుకి వస్తుంది.ఇది ఆవర్తన పట్టికలో 3వ గుంపుకి (కుటుంబానికి), 5వ పీరియడుకు చెందినది.

త్వరిత వాస్తవాలు యిట్రియం, Pronunciation ...

యిట్రియాన్ని కాంతిని వెదజల్లే పదార్థంగా, కాంతి ఉద్గారక డయోడ్ (LED) లలో ముఖ్యంగా వాడుతారు. ప్రత్యేకంగా టెలివిజన్ లోని ఋణ ధ్రువ కిరణ నాళం (కేథోడ్ రే ట్యూబ్) లో ఎరుపు రంగును వెదజల్లే పదార్థంగా వాడుతారు.[6] ఈ మూలకాన్ని విద్యుత్‌వాహక ధ్రువములు (ఎలక్ట్రోడ్లు), విద్యుద్విశ్లేష్యాలు (ఎలక్ట్రొలైట్స్), ఎలక్ట్రానిక్ ఫిల్టర్లు, లేజర్స్, సూపర్ కండక్టర్స్, వివిధ వైద్య అనువర్తనాలు, తయారీలో వాడుతారు.

ఈ మూలకానికికి జీవసంబంధమైన పాత్ర లేదు. ఈ మూలక సమ్మేళనాలు మనుష్యులకు ఊపిరితిత్తుల కేన్సర్ కలిగిస్తాయి.[7] పూర్వం ఎక్కువ వాడుకలో ఉన్న "పెట్రోమేక్స్" దీపాలలో "మేంటిల్" అనే వెలిగే ఒక వత్తి వంటి ఉపకరణం ఉండేది. చూడడానికి అల్లిక గుడ్డలా ఉన్న ఈ ఉపకరణం చెయ్యడానికి యిట్రియం వాడేవారు. ఎందుకంటే వేడెక్కినప్పుడు ఇది ఎక్కువ కాంతిని వెదజల్లేది. దీనిని అంతర్దహన యంత్రాల తయారీలోకూడా వాడతారు.

ఈ మూలకం పేరు స్వీడన్ దేశంలోని గ్రామం "యిటెర్బీ" నుండి వ్యుత్పత్తి అయినది. 1787లో ప్రసిద్ధ రసాయన శాస్త్రవేత్త అర్హీనియస్ ఆ గ్రామంలో కొత్త ఖనిజాన్ని గుర్తించి దానికి యిటెర్బైట్ అని నామకరణం చేసాడు. తరువాత జోహన్ గాడోలీన్ 1789లో అర్హీనియస్ నమూనాలోని యిట్రియం ఆక్సైడ్ ను కనుగొన్నాడు.[8] ఈ కొత్త ఆక్సైడ్ ను ఎకెబెర్గ్ అనే శాస్త్రజ్ఞుడు "యెట్రియా" అని పేరు పెట్టాడు. ఈ మూలకం 1828లో మొట్టమొదటి సారిగా ఫ్రెడ్చిచ్ వోలర్ చే వేరుచేయబడింది.[9]

Remove ads

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.

Remove ads