పీరియడ్ 6 మూలకం
From Wikipedia, the free encyclopedia
Remove ads
పీరియడ్ 6 మూలకం, లాంతనైడ్‌లతో సహా మూలకాల యొక్క ఆవర్తన పట్టికలోని ఆరవ వరుస (పీరియడ్)లోని రసాయన మూలకాలలో ఒకటి. మూలకాల పరమాణు సంఖ్య పెరిగేకొద్దీ వాటి రసాయన ప్రవర్తనలో పునరావృతమయ్యే (ఆవర్తన) ధోరణులను వివరించడానికి ఆవర్తన పట్టికను అడ్డు వరుసలలో రూపొందించారు: రసాయన ప్రవర్తన పునరావృతం కావడం ప్రారంభించినప్పుడు కొత్త వరుస ప్రారంభమవుతుంది, అంటే ఒకే విధమైన ప్రవర్తన కలిగిన మూలకాలు ఒకే నిలువు వరుసలో వస్తాయి.
| ఆవర్తన పట్టికలో పీరియడ్ 6 |
ఆరవ పీరియడ్‌లో 32 మూలకాలున్నాయి. సీసియంతో ప్రారంభమై రాడాన్‌తో ముగిసే పీరియడ్ 7 తో ఇది అత్యధికంగా ముడిపడి ఉంటుంది. సీసం ప్రస్తుతం తెలిసిన మూలకాల్లో చిట్ట చివరి స్థిరమైన మూలకం; ఆ తరువాతి మూలకాలన్నీ రేడియోధార్మికత కలిగి ఉంటాయి. అయితే బిస్మత్ యొక్క ఏకైక ఆదిమ ఐసోటోప్, 209Bi అర్ధ జీవిత కాలం 1019 సంవత్సరాలకు పైబడి ఉంది. ఇది విశ్వం యొక్క ప్రస్తుత వయస్సు కంటే 100 కోట్ల రెట్లు. నియమం ప్రకారం, పీరియడ్ 6 మూలకాలు ముందుగా వాటి 6s షెల్‌లను, తర్వాత వాటి 4f, 5d, 6p షెల్‌లను ఆ క్రమంలో నింపుతాయి; అయితే, దీనికి బంగారం వంటి మినహాయింపులు ఉన్నాయి.
Remove ads
పరమాణు లక్షణాలు
s-బ్లాక్ మూలకాలు
సీసియం
సీసియం (Cs) పరమాణు సంఖ్య 55 కలిగిన రసాయన మూలకం. ఇది 28°C ద్రవీభవన స్థానంతో మృదువైన, వెండి-బంగారు రంగులో ఉండే క్షార లోహం. ఇది గది ఉష్ణోగ్రత వద్ద (లేదా సమీపంలో) ద్రవంగా ఉండే ఐదు లోహాలలో ఒకటి. [note 1] సీసియం రుబిడియం, పొటాషియం లకు ఉండే భౌతిక రసాయన లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది చాలా రియాక్టివ్, పైరోఫోరిక్. -116 °C వద్ద కూడా నీటితో చర్య జరుపుతుంది. దీని స్థిరమైన ఐసోటోప్, సీసియం-133 అతి తక్కువ ఎలక్ట్రోనెగటివ్ ఉన్న మూలకం. సీసియం ఎక్కువగా పొల్యూసైట్ నుండి తవ్వబడుతుంది. అయితే రేడియో ఐసోటోప్‌లు, ముఖ్యంగా సీసియం-137, అణు విచ్ఛిత్తిలో ఉత్పత్తి అవుతుంది. అణు రియాక్టర్ల ద్వారా ఉత్పత్తి చేయబడిన వ్యర్థాల నుండి ఏర్పడుతుంది.
బేరియం
బేరియం (Ba) పరమాణు సంఖ్య 56 కలిగిన రసాయన మూలకం. ఇది గ్రూప్ 2లో ఐదవ మూలకం. మృదువుగా, వెండి రంగులో ఉండే క్షార మృత్తిక లోహం. బేరియం గాలితో దాని రియాక్టివిటీ కారణంగా దాని స్వస్వరూపంలో ప్రకృతిలో ఎప్పుడూ కనిపించదు. దీని ఆక్సైడ్‌ను చారిత్రికంగా బారిటా అని పిలుస్తారు. అయితే ఇది నీరు, కార్బన్ డయాక్సైడ్‌తో చర్య జరుపుతుంది. ఖనిజంగా కనుగొనబడలేదు. సహజంగా లభించే అత్యంత సాధారణ ఖనిజాలు - బేరియం సల్ఫేట్, BaSO 4 (బరైట్), బేరియం కార్బోనేట్, BaCO 3 ( విడరైట్ ). బేరియం పేరు గ్రీకు బారీస్ ( βαρύς ) నుండి ఉద్భవించింది, దీని అర్థం "భారీ". సాధారణ బేరియం కలిగిన కొన్ని ఖనిజాల అధిక సాంద్రతను ఈ పేరు సూచిస్తుంది.
Remove ads
f-బ్లాక్ మూలకాలు (లాంతనైడ్స్)
లాంతనైడ్ లేదా లాంతనాయిడ్ [2] సిరీస్‌లో లాంతనమ్ నుండి లుటెటియం వరకు పరమాణు సంఖ్యలు 57 నుండి 71 వరకు పదిహేను లోహ రసాయన మూలకాలు ఉంటాయి. [3] : 240 [4] ఈ పదిహేను మూలకాలు, రసాయనికంగా సారూప్య మూలకాలు స్కాండియం, యిట్రియంతో పాటు, వీటిని అరుదైన-భూమి మూలకాలు అంటారు.
డి-బ్లాక్ మూలకాలు
లుటేషియం
లుటేషియం పరమాణు సంఖ్య 71 కలిగిన రసాయన మూలకం. ఇది లాంతనైడ్ శ్రేణిలోని చివరి మూలకం. లాంతనైడ్‌లలో అత్యధిక కాఠిన్యం లేదా సాంద్రత కలిగిన మూలకం ఇది. ఆవర్తన పట్టికలో f-బ్లాక్‌లో ఉన్న ఇతర లాంతనైడ్‌ల వలె కాకుండా, ఈ మూలకం d-బ్లాక్‌లో ఉంటుంది; అయితే, లాంతనమ్ కొన్నిసార్లు డి-బ్లాక్ లాంతనైడ్ స్థానంపై ఉంచుతారు. రసాయనికంగా, లుటెటియం ఒక విలక్షణమైన లాంతనైడ్: దాని ఆక్సైడ్, హాలైడ్‌లు ఇతర సమ్మేళనాలలో కనిపించే దాని ఏకైక సాధారణ ఆక్సీకరణ స్థితి +3. సజల ద్రావణంలో, ఇతర లాంతనైడ్‌ల సమ్మేళనాల వలె, కరిగే లుటేటియం సమ్మేళనాలు తొమ్మిది నీటి అణువులతో ఒక సముదాయాన్ని ఏర్పరుస్తాయి.
హాఫ్నియం
హాఫ్నియం (Hf), పరమాణు సంఖ్య 72 కలిగిన రసాయన మూలకం. హాఫ్నియం మెరిసే, వెండి బూడిద రంగులో, టెట్రావాలెంట్ ట్రాన్సిషన్ లోహం. రసాయనికంగా జిర్కోనియంను పోలి ఉంటుంది, జిర్కోనియం ఖనిజాలలో లభిస్తుంది. దీని ఉనికిని 1869లో డిమిత్రి మెండలీవ్ అంచనా వేశాడు. హాఫ్నియం స్థిరమైన ఐసోటోప్ ఉన్న చిట్టచివరి మూలకంగా ఉండేది. (రెనియంను రెండు సంవత్సరాల తరువాత గుర్తించారు). హాఫ్నియమ్‌కు "కోపెన్‌హాగన్" కు లాటిన్ పేరు హాఫ్నియా నుండి ఆ పేరు పెట్టారు. దీన్ని కోపెన్‌హాగన్ లోనే కనుగొన్నారు.
టాంటలమ్
టాంటలమ్, పరమాణు సంఖ్య 73 కలిగిన రసాయన మూలకం. గతంలో టాంటాలియం అని పిలిచేవారు, ఈ పేరు గ్రీకు పురాణాల నుండి వచ్చిన టాంటాలస్ నుండి వచ్చింది. [6] టాంటాలమ్, అరుదైన, గట్టి, నీలం-బూడిద రంగులో ఉండే, మెరిసే పరివర్తన లోహం. ఇది అత్యంత తుప్పు నిరోధకతను కలిగి ఉంటుంది. ఇది పరివర్తన లోహాల గ్రూపులో భాగం. టాంటలమ్ యొక్క రసాయన జడత్వం కారణంగా దానిని ప్రయోగశాల పరికరాలకు విలువైన పదార్ధంగా, ప్లాటినమ్‌కు ప్రత్యామ్నాయంగా వాడతారు. అయితే దాని ప్రధాన ఉపయోగం మొబైల్ ఫోన్‌లు, DVD ప్లేయర్‌లు, వీడియో గేమ్ సిస్టమ్‌లు, కంప్యూటర్‌లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలలో టాంటలమ్ కెపాసిటర్‌లుగా ఉంది. టాంటలమ్, ఎల్లప్పుడూ రసాయనికంగా సారూప్యమైన నియోబియంతో కలిసి, టాంటలైట్, కొలంబైట్, కోల్టన్ ఖనిజాలలో సంభవిస్తుంది.
టంగ్స్టన్
టంగ్‌స్టన్ ను వోల్ఫ్రామ్ అని కూడా పిలుస్తారు. దీని రసాయన చిహ్నం W. పరమాణు సంఖ్య 74. టంగ్‌స్టన్ అనే పదం స్వీడిష్ భాష టంగ్ స్టెన్ నుండి (భారీ రాయి అని అర్థం) వచ్చింది.
రీనియం
రీనియం (Re), పరమాణు సంఖ్య 75 కలిగిన రసాయన మూలకం. ఇది ఆవర్తన పట్టికలోని గ్రూపు 7 లో వెండి-లాంటి తెలుపు రంగుతో, భారీగా, మూడవ వరుసలో ఉండే పరివర్తన లోహం. భూమి పైపెంకులో బిలియన్‌లో 1 భాగం (ppb) లభించే రీనియం అత్యంత అరుదైన మూలకాలలో ఒకటి. దీనికి మూలకాల్లో మూడవ అత్యధిక ద్రవీభవన స్థానం, అన్నిటికంటే అత్యధిక మరిగే స్థానం ఉంటుంది. రీనియం రసాయనికంగా మాంగనీస్‌ను పోలి ఉంటుంది. మాలిబ్డినం, రాగి ధాతువు యొక్క వెలికితీత, శుద్ధీకరణలో ఉప-ఉత్పత్తిగా లభిస్తుంది. రీనియం దాని సమ్మేళనాలలో −1 నుండి +7 వరకు అనేక రకాల ఆక్సీకరణ స్థితులను చూపుతుంది.
ఆస్మియం
ఆస్మియం (Os), పరమాణు సంఖ్య 76 కలిగిన రసాయన మూలకం. ఇది ప్లాటినం కుటుంబంలో గట్టి, పెళుసు, నీలం-బూడిద రంగులో లేదా నీలం-నలుపు రంగులో ఉండే పరివర్తన లోహం. 22.59 g/cm3 సాంద్రతతో ఇది, సహజంగా సంభవించే అత్యంత సాంద్రమైన మూలకం.22.59 (ఇరిడియం కంటే కొంచెం ఎక్కువ, సీసం కంటే రెండు రెట్లు ఎక్కువ సాంద్రత). ఇది ప్రకృతిలో ఎక్కువగా ప్లాటినం ఖనిజాలలో మిశ్రమంగా కనిపిస్తుంది. ప్లాటినం, ఇరిడియం, ఇతర ప్లాటినం గ్రూప్ లోహాల మిశ్రమలోహాలను ఫౌంటెన్ పెన్ ములుకులు, ఎలక్ట్రికల్ కాంటాక్ట్‌లు, విపరీతమైన మన్నిక, కాఠిన్యం అవసరమయ్యే ఇతర అనువర్తనాల్లో ఉపయోగిస్తారు. [7]
ఇరిడియం
ఇరిడియం (Ir), పరమాణు సంఖ్య 77 కలిగిన రసాయన మూలకం. ప్లాటినం కుటుంబానికి చెందిన చాలా గట్టి, పెళుసు, వెండి-లాంటి తెలుపు రంగులో ఉండే పరివర్తన లోహం. ఇరిడియం, ఆస్మియం తర్వాత అత్యషిక సాంద్రత కలిగిన మూలకం. 2000 °C కంటే ఎక్కువ ఉష్ణోగ్రతల వద్ద కూడా అత్యంత తుప్పు-నిరోధకత ఉన్న లోహం. కొన్ని కరిగిన లవణాలు, హాలోజన్‌లు మాత్రమే ఘన ఇరిడియమ్‌ను తినివేయగలిగినప్పటికీ, బాగా విభజించబడిన ఇరిడియం ధూళి, చాలా రియాక్టివ్‌గా ఉంటుంది. మండే అవకాశం కూడా ఉంది.
ప్లాటినం
ప్లాటినం (Pt), పరమాణు సంఖ్య 78 కలిగిన రసాయన మూలకం.
దీని పేరు స్పానిష్ పదం ప్లాటినా నుండి వచ్చింది, దీనికి "చిన్న వెండి" అని అర్థం. [8] ఇది దట్టమైన, సున్నితమైన, సాగే, విలువైన, బూడిద-తెలుపు రంగులో ఉండే పరివర్తన లోహం.
ప్లాటినంకు ప్రాకృతికంగా లభించే ఆరు ఐసోటోప్‌లు ఉన్నాయి. ఇది భూమి పైపెంకులో అరుదుగా లభించే మూలకాలలో ఒకటి. దీనికి సగటు అందుబాటు సుమారు 5 μg/kg. ఇది అతి తక్కువ రియాక్టివ్ మెటల్. ఇది కొన్ని నికెల్, రాగి ఖనిజాలతో పాటు కొన్ని స్థానిక నిక్షేపాలలో, ఎక్కువగా దక్షిణాఫ్రికాలో, లభిస్తుంది. ప్రపంచ ప్లాటినం ఉత్పత్తిలో 80% వాటా దక్షిణాఫ్రికాదే.
బంగారం
బంగారం (Au) దట్టమైన, మృదువైన, మెరిసే, సున్నితంగా ఉండి, సాగే గుణమున్న లోహం. దీని పరమాణు సంఖ్య 79.
స్వచ్ఛమైన బంగారం ప్రకాశవంతమైన పసుపు రంగును కలిగి ఉంటుంది. సాంప్రదాయకంగా ఆకర్షణీయంగా పరిగణించబడే మెరుపును కలిగి ఉంటుంది. ఇది గాలి లేదా నీటిలో ఆక్సీకరణం చెందదు. రసాయనికంగా, బంగారం, పరివర్తన లోహం, గ్రూపు 11 లోని మూలకం. ఇది ప్రామాణిక పరిస్థితుల్లో ఘనరూపంలో ఉండి, అతి తక్కువ రియాక్టివుగా ఉండే రసాయన మూలకాలలో ఒకటి. అందువల్ల ఈ లోహం తరచుగా స్వస్వరూపంలో, రాళ్ళలో నగ్గెట్స్ లేదా గ్రెయిన్లుగా, ఒండ్రు నిక్షేపాలలో లభిస్తుంది. ఇది సాధారణంగా టెల్లూరియంతో కలిసి సమ్మేళనాలుగా ఖనిజాలలో లభిస్తుంది.
పాదరసం
మెర్క్యురీ (Hg), పరమాణు సంఖ్య 80 కలిగిన రసాయన మూలకం. దీనిని పాదరసం అని, క్విక్‌సిల్వర్ లేదా హైడ్రార్‌గైరమ్ అని కూడా అంటారు. ఇది భారీగా ఉండే d-బ్లాక్ మూలకం. పాదరసం ప్రామాణిక ఉష్ణోగ్రత, పీడనం పరిస్థితుల్లో ద్రవంగా ఉండే ఏకైక లోహం. ఈ పరిస్థితుల్లో ద్రవంగా ఉండే ఏకైక ఇతర మూలకం బ్రోమిన్. సీసియం, ఫ్రాన్సియం, గాలియం, రుబిడియం వంటి లోహాలు గది ఉష్ణోగ్రత కంటే కొంచెం ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద కరుగుతాయి. −38.83 °C ఘనీభవన స్థానంతో, 356.73 °C మరిగే స్థానం ఉన్న పాదరసం, అతి తక్కువ ద్రవ స్థితి ఉష్ణోగ్రతల శ్రేణి ఉన్న లోహాల్లో ఒకటి. [9]
Remove ads
p-బ్లాక్ మూలకాలు
థాలియం
థాలియం (Tl), పరమాణు సంఖ్య 81 కలిగిన రసాయన మూలకం. ఈ మృదువైన బూడిద రంగు మూలకం ఇతర మెటల్ టిన్‌ను పోలి ఉంటుంది. కానీ గాలికి గురైనప్పుడు రంగు మారుతుంది. ఇద్దరు రసాయన శాస్త్రవేత్తలు విలియం క్రూక్స్, క్లాడ్-అగస్టే లామీ లు 1861లో కొత్తగా అభివృద్ధి చేసిన ఫ్లేమ్ స్పెక్ట్రోస్కోపీ పద్ధతి ద్వారా థాలియంను విడివిడిగా కనుగొన్నారు. ఇద్దరూ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఉత్పత్తి చేసినపుడు ఏర్పడిన అవశేషాలలో ఈ కొత్త మూలకాన్ని కనుగొన్నారు.
సీసం
సీసం (Pb), కార్బన్ గ్రూపు లోని ప్రధాన-గ్రూపు మూలకం. పరమాణు సంఖ్య 82. సీసం ఒక మృదువైన, సున్నితంగా ఉండే ఇతర లోహం. ఇది భారీ లోహాలలో ఒకటిగా కూడా పరిగణించబడుతుంది. మెటాలిక్ సీసం తాజాగా తయారైన తర్వాత నీలం-తెలుపు రంగును కలిగి ఉంటుంది. అయితే ఇది గాలికి గురైనప్పుడు వెంటనే బూడిద రంగులోకి మారుతుంది. సీసం ద్రవంగా కరిగినప్పుడు మెరిసే క్రోమ్-వెండి మెరుపును కలిగి ఉంటుంది.
బిస్మత్
బిస్మత్ (Bi), పరమాణు సంఖ్య 83 కలిగిన రసాయన మూలకం. బిస్మత్, ఒక ట్రివాలెంట్ ఇతర లోహం. రసాయనికంగా ఆర్సెనిక్, యాంటీమోనీని పోలి ఉంటుంది. బిస్మత్ మూలకం సహజంగా సమ్మేళనంగా ఉండనప్పటికీ సల్ఫైడ్, ఆక్సైడ్లు ముఖ్యమైన వాణిజ్య ఖనిజాలు. బిస్మత్ స్వేచ్ఛా మూలకం సాంద్రత, సీసం సాంద్రతలో 86% ఉంటుంది. ఇది వెండి తెలుపు రంగుతో పెళుసుగా ఉండే లోహం. కానీ తరచుగా ఉపరితల ఆక్సైడ్ కారణంగా పింక్ రంగుతో గాలిలో కనిపిస్తుంది. బిస్మత్ మెటల్ పురాతన కాలం నుండి ప్రసిద్ధి చెందినప్పటికీ 18వ శతాబ్దం వరకు ఇది తరచుగా సీసం, టిన్‌తో తికమక కలిగించేది. వీటన్నిటికీ బిస్మత్ కు ఉండే భౌతిక లక్షణాలు ఉంటాయి. శబ్దవ్యుత్పత్తి శాస్త్రం అనిశ్చితంగా ఉంది కానీ బహుశా దీని పేరు అరబిక్ bi ismid అనే పదం నుండి వచ్చి ఉంటుంది. దీని అర్థం యాంటిమోనీ లక్షణాలు ఉండేది అని. [10]
పోలోనియం
పోలోనియం, పరమాణు సంఖ్య 84 కలిగిన రసాయన మూలకం. దీనిని 1898లో మేరీ స్కోడోవ్స్కా-క్యూరీ, పియరీ క్యూరీ లు కనుగొన్నారు. అరుదైన, అత్యంత రేడియోధార్మిక మూలకం, పొలోనియం రసాయనికంగా బిస్మత్ [11] టెల్లూరియంతో సమానంగా ఉంటుంది. ఇది యురేనియం ఖనిజాలలో లభిస్తుంది. వ్యోమనౌకలను వేడి చేయడంలో ఉపయోగపడుతుందేమోనని దీన్ని అధ్యయనం చేసారు. అస్థిరంగా ఉన్నందున పొలోనియం యొక్క ఐసోటోపులన్నీ రేడియోధార్మికత కలిగి ఉంటాయి. పోలోనియం ఒక పోస్ట్-ట్రాన్సిషన్ లోహమా లేదా మెటాలాయిడా అనే విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. [12]
అస్టాటిన్
అస్టాటిన్ (At ) రేడియోధార్మిక రసాయన మూలకం. దీని పరమాణు సంఖ్య 85. ఇది భారీ మూలకాల క్షయం ఫలితంగా మాత్రమే భూమిపై సంభవిస్తుంది, వేగంగా క్షయమౌతుంది. ఆవర్తన పట్టికలోని దాని ఎగువనున్న వాటి కంటే ఈ మూలకం గురించి చాలా తక్కువగా తెలుసు. మునుపటి అధ్యయనాలు తేలికైన హాలోజన్‌ల కంటే ద్రవీభవన, మరిగే బిందువులు ఎక్కువగా ఉండటంతో, ఈ మూలకం ఆవర్తన ధోరణులను అనుసరిస్తుందని తేలింది. హాలోజన్లలో ఇది అత్యంత భారీ మూలకం.
రాడాన్
రాడాన్, Rn పరమాణు సంఖ్య 86 కలిగిన రసాయన మూలకం. ఇది రేడియోధార్మికత కలిగిన, రంగు, వాసన, రుచి లేని ఉత్కృష్ట వాయువు. యురేనియం, థోరియం ల క్షయం నుండి సహజంగా సంభవిస్తుంది. దాని అత్యంత స్థిరమైన ఐసోటోప్, <sup id="mwBX4">222</sup>Rn, 3.8 రోజుల సగం జీవితాన్ని కలిగి ఉంటుంది. సాధారణ పరిస్థితుల్లో వాయువుగా ఉండే అత్యంత సాంద్రమైన పదార్థాలలో రాడాన్ ఒకటి. ఇది సాధారణ పరిస్థితుల్లో రేడియోధార్మికత కలిగిన ఏకైక వాయువు. దాని రేడియోధార్మికత కారణంగా ఆరోగ్యానికి ప్రమాదంగా పరిగణించబడుతుంది. తీవ్రమైన రేడియోధార్మికత కారణంగకూడా రాడాన్ రసాయన అధ్యయనాలకు ఆటంకం కలిగించింది. దీని సమ్మేళనాల్లో కొన్ని మాత్రమే తెలుసు.
Remove ads
నోట్స్
మూలాలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads