నగరపాలక సంస్థ
భారతదేశంలో ఒక స్థానిక ప్రభుత్వ వర్గానికి చెందిన సంస్థ / From Wikipedia, the free encyclopedia
మునిసిపల్ కార్పొరేషన్, నగరపాలక సంస్థ, సిటీ కార్పొరేషన్, మహానగర్ పాలిక, మహానగర్ నిగం లేదా, నగర్ నిగం లేదా నగర్ సభ అనేవి, భారతదేశంలో ఒక స్థానిక ప్రభుత్వం వర్గానికి చెందిన సంస్థ.ఇది ఒక మిలియన్ కంటే ఎక్కువ జనాభా ఉన్న పట్టణ ప్రాంతాల పరిపాలనను నిర్వహిస్తుంది. భారతదేశంలోని వివిధ నగరాల్లో పెరుగుతున్న జనాభా, పట్టణీకరణకు స్థానిక పాలకమండలి అవసరం అనే భావనతో ఏర్పడ్డాయి. ఆరోగ్య సంరక్షణ, విద్యాసంస్థల నిర్వహణ, గృహనిర్మాణం, రవాణావంటి అవసరమైన సమాజ సేవలను అందించడానికి ఇది పనిచేస్తుంది.74 వ రాజ్యాంగ సవరణ చట్టం, పట్టణ స్థానిక సంస్థల ప్రభుత్వాలకు సంబంధించిన నిబంధనలను ఖరారు చేసింది.[1]
త్వరిత వాస్తవాలు
భారతదేశం |
ఈ వ్యాసం భారతదేశ రాజకీయాలు, ప్రభుత్వంలో ఒక భాగం. |
|
|
|
మూసివేయి