1556: రెండవ పానిపట్టు యుద్ధంలో అక్బరు సైన్యం హేమును ఓడించిన రోజు. అప్పటికి అక్బరుకు పదమూడేళ్లు. సైన్యాధ్యక్షుడు బైరాంఖాన్ ఆధ్వర్యంలో మొఘలులకు ఈ విజయం సొంతమైంది.
1605: బ్రిటిష్ పార్లమెంటు భవనాన్ని పేల్చివేసేందుకు రోమన్ క్యాథలిక్కులు పన్నిన కుట్ర విఫలమైన రోజు. దీన్నే 'గన్‌పౌడర్ ప్లాట్' అంటారు. 'గై ఫాకెస్' అనే వ్యక్తి పేలుడు సామగ్రితో పార్లమెంటు లోపలికి వెళ్తుండగా భద్రతా సిబ్బంది పట్టుకున్నారు. నాటి నుంచి ఏటా నవంబర్ 5న ఇంగ్లండ్‌లో బాణాసంచా కాల్చి 'గై ఫాకెస్ డే'గా జరుపుకుంటారు.
1895: జార్జ్ సెల్డెన్ రూపొందించిన గ్యాసోలిన్తో నడిచే ఇంజిన్‌కు పేటెంటు హక్కులు లభించాయి. అమెరికన్ ఆటోవెుబైల్ రంగానికి సంబంధించినంత వరకూ ఇదే మొదటి పేటెంటు.