గ్రూప్ 6 మూలకం

IUPAC శైలి ప్రకారం గ్రూప్ 6 అనేది ఆవర్తన పట్టికలోని మూలకాల గ్రూప్. From Wikipedia, the free encyclopedia

గ్రూప్ 6 మూలకం
Remove ads

IUPAC శైలి ప్రకారం గ్రూప్ 6 అనేది ఆవర్తన పట్టికలోని మూలకాల గ్రూప్. దీని లోని మూలకాలు క్రోమియం (Cr), మాలిబ్డినం (Mo), టంగ్‌స్టన్ (W), సీబోర్జియం (Sg). ఇవన్నీ పరివర్తన లోహాలు. క్రోమియం, మాలిబ్డినం, టంగ్‌స్టన్ ఉష్ణ నిరోధక లోహాలు.

త్వరిత వాస్తవాలు ఆవర్తన పట్టికలో గ్రూప్ 8, IUPAC group number ...

ఈ మూలకాలు ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషనులో ఒకే ధోరణిని అనుసరించవు. అయితే బయటి షెల్‌లు రసాయన ప్రవర్తనలో ధోరణులతో పరస్పర సంబంధం కలిగి ఉంటాయి:

మరింత సమాచారం Z, మూలకం ...

"గ్రూప్ 6" అనేది ఈ సమూహానికి కొత్త IUPAC పేరు; పాత శైలి పేరు పాత US సిస్టమ్ (CAS)లో " గ్రూప్ VIB " అని, యూరోపియన్ సిస్టమ్ (పాత IUPAC)లో " గ్రూప్ VIA " అనేవారు. VIA (US సిస్టమ్, CAS) లేదా VIB (యూరోపియన్ సిస్టమ్, పాత IUPAC) యొక్క పాత-శైలి గ్రూప్ పేర్లతో 6వ గ్రూప్ తికమక పడకూడదు. గ్రూపును ఇప్పుడు గ్రూప్ 16 అంటారు.

Remove ads

రసాయన శాస్త్రం

ఇతర సమూహాల మాదిరిగా కాకుండా, ఈ కుటుంబంలోని మూలకాలు వాటి ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్‌లో ఒకే ధోరణిని అనుసరించవు. ఎందుకంటే గ్రూప్ లోని రెండుతేలికైన మూలకాలకు Aufbau సూత్రం నుండి మినహాయింపులున్నాయి:

మరింత సమాచారం Z, మూలకం ...

గ్రూప్ లోని మొదటి మూడు మూలకాలకు మాత్రమే చాలా వరకు రసాయన ధర్మాలను గమనించారు. సీబోర్జియం రసాయన ధర్మాలను అంతగా గమనించలేదు. అందువల్ల మిగిలిన విభాగం ఆవర్తన పట్టికలో దాని ఎగువ పొరుగువారితో మాత్రమే వ్యవహరిస్తుంది. గ్రూప్ లోని మూలకాలు, 7-11 సమూహాల మాదిరిగానే, అధిక ద్రవీభవన బిందువులను కలిగి ఉంటాయి. అధిక ఆక్సీకరణ స్థితులలో అస్థిర సమ్మేళనాలను ఏర్పరుస్తాయి. గ్రూప్ లోని అన్ని మూలకాలు అధిక ద్రవీభవన బిందువులతో సాపేక్షంగా ప్రతిచర్య లేని లోహాలు (1907 °C, 2477 °C, 3422 °C); టంగ్‌స్టన్ ద్రవీభవన బిందువు అన్ని లోహాల లోకీ అత్యధికమైనది. లోహాలు వివిధ ఆక్సీకరణ స్థితులలో సమ్మేళనాలను ఏర్పరుస్తాయి: క్రోమియం −2 నుండి +6 వరకు అన్ని స్థితులలో సమ్మేళనాలను ఏర్పరుస్తుంది. అవి: [1] డిసోడియం పెంటాకార్బొనిల్క్రోమేట్, డిసోడియం డెకాకార్బొనిల్డైక్రోమేట్, బిస్(బెంజీన్)క్రోమియం, ట్రిపోటాషియం పెంటానిట్రోసైనోక్రోమేట్, క్రోమియం(II) క్రోమియం ఆక్సైడ్, క్రోమియం(IV) క్లోరైడ్, పొటాషియం టెట్రాపెరోక్సోక్రోమేట్(V), క్రోమియం(VI) డైక్లోరైడ్ డయాక్సైడ్. మాలిబ్డినం, టంగ్‌స్టన్‌లకు కూడా ఇదే వర్తిస్తుంది, అయితే +6 స్థితి యొక్క స్థిరత్వం గ్రూప్‌లో పెరుగుతుంది. ఆక్సీకరణ స్థితులపై ఆధారపడి, సమ్మేళనాలు క్షారంగా, యాంఫోటెరిక్‌గా లేదా ఆమ్లంగా ఉంటాయి. లోహం ఆక్సీకరణ స్థితి పెరిగే కొద్దీ ఆమ్లత్వం పెరుగుతుంది.

Remove ads

లభ్యత

క్రోమియం అనేది చాలా సాధారణ సహజమైన మూలకం . ఇది భూమి పెంకులో 100ppm సగటు సాంద్రతతో 21వ అత్యంత సమృద్ధిగా ఉన్న మూలకం. క్రోమియం అత్యంత సాధారణ ఆక్సీకరణ స్థితులు సున్నా, ట్రివాలెంట్, హెక్సావాలెంట్ స్థితులు. చాలా సహజంగా లభించే క్రోమియం హెక్సావాలెంట్ స్థితిలో ఉంటుంది. [2] ప్రపంచంలోని క్రోమియంలో దాదాపు రెండు వంతులు దక్షిణాఫ్రికాలో ఉత్పత్తి అవుతోంది. ఆ తరువాత కజాక్స్తాన్, భారతదేశం, రష్యా, టర్కీ వస్తాయి. క్రోమియంను క్రోమైట్ ఖనిజంగా తవ్వుతారు.

టంగ్‌స్టన్ భూమిలోని అత్యంత అరుదైన మూలకాలలో ఒకటి. భూమి పెంకులో దీని సగటు సాంద్రత 1.5ppm. టంగ్‌స్టన్ ప్రధానంగా వోల్‌ఫ్రమైట్, స్కీలైట్ అనే ఖనిజాలలో కనిపిస్తుంది. ఇది సాధారణంగా ప్రకృతిలో స్వేచ్ఛా మూలకం వలె కనిపించదు . ప్రపంచంలో టంగ్‌స్టన్‌ను అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశాలు చైనా, రష్యా, పోర్చుగల్.

సీబోర్జియం ప్రకృతిలో లేదు గానీ, ప్రయోగశాలలో తయారు చేసారు.

Remove ads

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.

Remove ads