గ్రూప్ 8 మూలకం
From Wikipedia, the free encyclopedia
Remove ads
గ్రూప్ 8 అనేది ఆవర్తన పట్టికలోని రసాయన మూలకాల గ్రూప్ (కాలమ్). ఇందులో ఇనుము (Fe), రుథేనియం (Ru), ఓస్మియం (Os), హాసియం (Hs) ఉంటాయి. [1] ఇవన్నీ పరివర్తన లోహాలు.
ఇతర సమూహాల మాదిరిగానే, ఈ కుటుంబంలోని మూలాకలకు ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్‌లో ఒకే ధోరణి ఉంటుంది. ముఖ్యంగా బయటి షెల్‌లలో, రసాయన ప్రవర్తనలో ధోరణులు ఏర్పడతాయి.
"గ్రూప్ 8" అనేది ఈ సమూహానికి ఆధునిక ప్రామాణిక హోదా, దీనిని 1990 లో IUPAC ఆమోదించింది. [1]
పాత సమూహ నామకరణ వ్యవస్థలలో, ఈ గ్రూప్ 9, 10 గ్రూపులతో కలిపి కెమికల్ అబ్‌స్ట్రాక్ట్స్ సర్వీస్ (CAS) "VIIIB" అని, పాత IUPAC (1990కి ముందు) వ్యవస్థలో "VIII" (మెండలీవ్ పట్టికలో కూడా) అని అనేవారు.
గ్రూప్ 8 (ప్రస్తుత IUPAC)ని CAS సిస్టమ్ లోని "గ్రూప్ VIIIA"తో అయోమయం చెందకూడదు. గ్రూప్ VIIIA అనేది ప్రస్తుత IUPAC వ్యవస్థలో గ్రూప్ 18 - ఉత్కృష్ట వాయువులు .
ఆవర్తన పట్టికలోని గ్రూపులకు (నిలువు వరుసలు) కొన్నిసార్లు వాటి లోని తేలికైన మూలకం పేరు పెట్టారు (గ్రూప్ 16 ను "ఆక్సిజన్ గ్రూప్" అంటారు). అయితే, ఐరన్ గ్రూప్ అనే పదానికి "గ్రూప్ 8" అని అర్థం కాదు . చాలా తరచుగా, క్రోమియం, మాంగనీస్, ఇనుము, కోబాల్ట్, నికెల్ వంటి ఇనుమును కలిగి ఉన్న పీరియడ్ (వరుస) 4 లోని పక్కపక్కనే ఉన్న మూలకాల సమితిని ఐరన్ గ్రూప్ అంటారు.
Remove ads
ప్రాథమిక లక్షణాలు
మొదటి మూడు మూలకాలు దృఢమైన, వెండి-లాంటి తెలుపు రంగులో ఉండే లోహాలు. హాసియంను మాక్రోస్కోపిక్ స్వచ్ఛమైన రూపంలో వేరుచేయలేదు, దాని లక్షణాలను కూడా నిశ్చయంగా గమనించలేదు.
Remove ads
మూలాలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads