గ్రూప్ 9 మూలకం
From Wikipedia, the free encyclopedia
Remove ads
ఆధునిక IUPAC నంబరింగ్ పద్ధతి ప్రకారం గ్రూప్ 9 అనేది ఆవర్తన పట్టికలోని రసాయన మూలకాల గ్రూప్ (కాలమ్). గ్రూప్ 9లోని మూలకాలు కోబాల్ట్ (Co), రోడియం (Rh), ఇరిడియం (Ir), మీట్నీరియం (Mt). [1] ఇవన్నీ d-బ్లాక్‌లోని పరివర్తన లోహాలు, వీటిలో కొన్ని అత్యంత అరుదైనవిగా పరిగణించబడతాయి. [2]
ఇతర సమూహాల మాదిరిగానే, ఈ కుటుంబంలోని సభ్యులు ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్‌లో ఒకే ధోరణిని కలిగి ఉంటాయి. ముఖ్యంగా బయటి షెల్‌లలో, రసాయన ప్రవర్తనలో ధోరణులు ఉంటాయి. అయితే, రోడియం మాత్రం ఈ ధోరణికి మినహాయింపు.
"గ్రూప్ 9" అనేది ఈ సమూహానికి ఆధునిక ప్రామాణిక హోదా, దీనిని 1990 లో IUPAC ఆమోదించింది.[1]
పాత గ్రూపు నామకరణ వ్యవస్థలలో, ఈ సమూహాన్ని గ్రూప్ 8 (ఇనుము, రుథేనియం, ఓస్మియం, హాసియం ), గ్రూప్ 10 ( నికెల్, పల్లాడియం, ప్లాటినం, డార్మ్‌స్టాడియం) లతో కలిపి,కెమికల్ అబ్‌స్ట్రాక్ట్స్ సర్వీస్ (CAS) లో గ్రూప్ "VIIIB" అని, పాత IUPAC (1990కి ముందు) లో "VIII" అనీ (మెండలీవ్ ఒరిజినల్ పట్టికలో కూడా) అనేవారు.
Remove ads
రసాయన శాస్త్రం
[*] ఊహ.
మొదటి మూడు మూలకాలు గట్టి, వెండి-లాంతి తెలుపు రంగు లోహాలు:
కోబాల్ట్ ఒక లోహ మూలకం. ఇది గాజును లోతైన నీలం రంగులోకి మార్చడానికి ఉపయోగపడుతుంది.
రోడియం మెరిసే లోహంగా నగలలో ఉపయోగించవచ్చు.
ఇరిడియం ప్రధానంగా ప్లాటినం మిశ్రమాలకు దృఢత్వాన్ని ఇచ్చే ఏజెంట్‌గా ఉపయోగపడుతుంది.
మీట్నేరియం యొక్క అన్ని తెలిసిన ఐసోటోప్‌లు తక్కువ అర్ధ-జీవితాలతో రేడియోధార్మికత కలిగి ఉంటాయి. ప్రయోగశాలలలో కొద్ది పరిమాణాల్లో మాత్రమే సంశ్లేషణ చేసారు. దీన్ని స్వచ్ఛమైన రూపంలో వేరుచేయలేదు, భౌతిక రసాయన లక్షణాలను ఇంకా నిర్ణయించలేదు.
Remove ads
ఇవి కూడా చూడండి
ప్రస్తావనలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads