పీరియడ్ 1 మూలకం
From Wikipedia, the free encyclopedia
Remove ads
పీరియడ్ 1 మూలకం అనేది రసాయన మూలకాల ఆవర్తన పట్టికలోని మొదటి వరుస (లేదా పీరియడ్) లోని రసాయన మూలకాలలో ఒకటి. మూలకాల పరమాణు సంఖ్య పెరిగేకొద్దీ వాటి రసాయన ప్రవర్తనలో పునరావృతమయ్యే (ఆవర్తన) ధోరణులను వివరించడానికి ఆవర్తన పట్టికను అడ్డు వరుసలలో రూపొందించారు: రసాయన ప్రవర్తన పునరావృతం కావడం ప్రారంభించినప్పుడు కొత్త వరుస ప్రారంభమవుతుంది, అంటే ఒకే విధమైన ప్రవర్తన కలిగిన మూలకాలు ఒకే నిలువు వరుసలో వస్తాయి.
Period 1 in the periodic table |
మొదటి పీరియడ్‌లో ఆవర్తన పట్టికలోని ఇతర వరుసల కంటే తక్కువ మూలకాలు ఉంటాయి. ఇందులో కేవలం రెండు మాత్రమే - హైడ్రోజన్, హీలియం ఉంటాయి. ఈ పరిస్థితిని అణు నిర్మాణం యొక్క ఆధునిక సిద్ధాంతాల ద్వారా వివరించవచ్చు. పరమాణు నిర్మాణం యొక్క క్వాంటం మెకానికల్ వివరణలో, ఈ పీరియడ్ 1s కక్ష్య యొక్క పూరకానికి అనుగుణంగా ఉంటుంది. పీరియడ్ 1 మూలకాలు డ్యూయెట్ నియమాన్ని పాటిస్తాయి - వాటి వేలెన్స్ షెల్‌ను పూర్తి చేయడానికి వాటికి రెండు ఎలక్ట్రాన్లు అవసరం.
హైడ్రోజన్, హీలియంలు విశ్వంలో అత్యంత పురాతనమైనవి, అత్యంత సమృద్ధిగా ఉన్న మూలకాలు.
Remove ads
మూలకాలు
హైడ్రోజన్


హైడ్రోజన్ (H) పరమాణు సంఖ్య 1 కలిగిన రసాయన మూలకం. ప్రామాణిక ఉష్ణోగ్రత పీడనం వద్ద హైడ్రోజన్ H2 పరమాణు సూత్రంతో, రంగులేని, వాసన లేని, రుచిలేని, అత్యంత మండే డయాటోమిక్ వాయువు. 1.00794 amu పరమాణు ద్రవ్యరాశితోహైడ్రోజన్, అత్యంత తేలికైన మూలకం. [1]
హైడ్రోజన్ రసాయన మూలకాలలో అత్యంత సమృద్ధిగా లభించే మూలకం. విశ్వం యొక్క మూలక ద్రవ్యరాశిలో హైడ్రోజన్ దాదాపు 75% ఉంటుంది. [2] ప్రధాన శ్రేణిలోని నక్షత్రాల్లో ప్రధానంగా వాటి ప్లాస్మా స్థితిలో హైడ్రోజనే ఉంటాయి. మూలక హైడ్రోజన్ భూమిపై చాలా అరుదు. పారిశ్రామికంగా మీథేన్ వంటి హైడ్రోకార్బన్‌ల నుండి ఉత్పత్తి చేస్తారు. దీని తర్వాత చాలా మౌలిక హైడ్రోజన్ "క్యాప్టివ్‌గానే" (అక్కడే) ఉపయోగిస్తారు. హైడ్రోక్రాకింగ్, అమ్మోనియా ఉత్పత్తి, ఎక్కువగా ఎరువుల ఉత్పత్తిలో హైడ్రోజన్‌ను వాడతారు. విద్యుద్విశ్లేషణ ప్రక్రియను ఉపయోగించి నీటి నుండి హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేయవచ్చు, అయితే ఈ ప్రక్రియ సహజ వాయువు నుండి హైడ్రోజన్ ఉత్పత్తి కంటే వాణిజ్యపరంగా చాలా ఖరీదైనది. [3]
హీలియం

హీలియం (He) రంగులేని, వాసన లేని, రుచిలేని, విషరహిత, జడ మోనో అటామిక్ రసాయన మూలకం. ఇది ఆవర్తన పట్టికలోని ఉత్కృష్ట వాయువుల సిరీస్‌కు నాయకత్వం వహిస్తుంది. దీని పరమాణు సంఖ్య 2. [4] దాని మరిగే, ద్రవీభవన బిందువులు మూలకాలలో కెల్లా అతి తక్కువ. విపరీతమైన పరిస్థితులలో తప్ప ఇది వాయువుగా మాత్రమే ఉంటుంది. [5]
Remove ads
మూలాలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads