ఆగష్టు 25 , గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 237వ రోజు (లీపు సంవత్సరములో 238వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 128 రోజులు మిగిలినవి.
1694 : థియోడోర్ వాన్ న్యుహాఫ్ జర్మన్ సాహసికుడు. కింగ్ ఆఫ్ కోర్సికాగా ప్రసిద్ధుడు. (మ.1756)
1724 : జార్జ్ స్టబ్స్ , ఇంగ్లాండుకు చెందిన చిత్రకారుడు. (మ.1806)
1865 : రాయచోటి గిరిరావు , సంఘ సేవకులు, విద్యావేత్త. (మ.1918)
1893 : కొర్వి కృష్ణస్వామి ముదిరాజ్ , హైదరాబాదు మాజీ మేయరు, రచయిత, పాత్రికేయడు, విద్యావేత్త, బహుముఖ ప్రజ్ఞాశీలి. (మ.1967)
1917 : దేవులపల్లి రామానుజరావు , రచయిత.
1920: ఏల్చూరి సుబ్రహ్మణ్యం , కవి,రచయిత,పాత్రికేయుడు .
1926 : మైనంపాటి వేంకటసుబ్రహ్మణ్యము , కవి, రచయిత, చిత్రకారుడు. (మ.2010)
1938: చిత్తరంజన్ , లలిత గీతాల రచయిత , గాయకుడు, సంగీత దర్శకుడు .(మ.2023)
1952 : దులీప్ మెండిస్ , శ్రీలంక క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు.
1952: విజయ కాంత్ , తమిళ సినిమా నాయకుడు, రాజకీయ నాయకుడు(మ.2023)
1955 : సోమరాజు సదారాం , తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు చట్టం ప్రధాన కమిషనర్
1961 : బిల్లీ రే సైరస్ , అమెరికా సంగీత గాయకుడు, గీత రచయిత, నటుడు.
1962 : తస్లీమా నస్రీన్ , బెంగాలీ రచయిత్రి.
1973: నిత్యశ్రీ మహదేవన్, కర్ణాటకసంగీత విద్వాంసురాలు, ప్లే బ్యాక్ సింగర్.
1987 : బ్లెక్ లైవ్లీ , అమెరికా టీ.వీ., సినిమా నటి.
1987: మోనికా , దక్షిణ భారత చలన చిత్ర నటి.
William Herschel01
1822 : విలియం హెర్షెల్ , వరుణ (యురేనస్) గ్రహాన్ని కనుగొన్న ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త. (జ.1738)
1867 : మైకేల్ ఫెరడే , ఆంగ్ల రసాయన శాస్త్రవేత్త, భౌతిక శాస్త్రవేత్త. (జ.1791)
1908 : హెన్రీ బెక్వెరెల్ , భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత.
1953 : సురవరం ప్రతాపరెడ్డి , పత్రికా సంపాదకుడు, పరిశోధకుడు, క్రియాశీల ఉద్యమకారుడు. (జ.1896)
1960 : చింతా దీక్షితులు , రచయిత. (జ.1891)
1969 : మఖ్దూం మొహియుద్దీన్ , కార్మిక నాయకుడు, ఉర్దూకవి. (జ.1908)
1999 : సూర్యదేవర సంజీవదేవ్ , తత్వవేత్త, చిత్రకారుడు, రచయిత, కవి. (జ.1924)
2012 : నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ , చంద్రుడిపై కాలు పెట్టిన మొదటి మనిషి. (జ.1930)
2015 : పటోళ్ల కృష్ణారెడ్డి , ఆంధ్రపదేశ్ శాసన సభలో నాలుగు పర్యాయాలు నారాయణఖేడ్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన కాంగ్రెస్ నేత.
ఆగష్టు 24 - ఆగష్టు 26 - జూలై 25 - సెప్టెంబర్ 25 -- అన్ని తేదీలు
మరింత సమాచారం నెలలు తేదీలు, జనవరి ...
మూసివేయి