మస్జిద్ లేక మసీదు: ఇస్లాం మతాన్ని అవలంబించు ముస్లింల ప్రార్థనాలయం. మస్జిద్ అరబ్బీ పేరు, (مسجد), బహువచనం మసాజిద్ (مساجد). సాధారణ మస్జిద్ కు, చిన్న మస్జిద్ కు మస్జిద్ అని, పెద్ద మస్జిద్ కు జామా మస్జిద్ (جامع), లేక మస్జిద్-ఎ-జామి అని అంటారు.
ప్రాథమికంగా మస్జిద్ అనగా ప్రార్థనా స్థలము. ప్రస్తుతం ప్రపంచంలో మస్జిద్ లు సర్వసాధారణం. ముస్లింసమాజపు ప్రాముఖ్యాన్నిబట్టి మస్జిద్ లు తమ నిర్మాణశైలులు పొందియున్నాయి. ఇవి మస్జిద్-ఎ-ఖుబా , మస్జిద్-ఎ-నబవి 7వ శతాబ్దంలో నిర్మితమయిన ఆధారంగా నిర్మింపబడుచున్నవి.