1910: జపాన్కొరియా పేరును ఛోసెన్ గా మార్చీ, ఆ కొత్త వలసను పాలించటానికి ఒక గవర్నర్ జనరల్ ను నియమించింది.
1915: యు.ఎస్. నేవీ గజ ఈతగాళ్ళు ప్రమాదంలో మొదటిసారిగా ములిగిపోయిన ఎఫ్-4 అనే జలాంతర్గామిని బయటికి తీసారు.
1916: ఫిలిప్పైన్స్ అటానమీ చట్టాన్ని (స్వయంగా పాలించుకోవటం) అమెరికా ఆమోదించింది.
1930: సెయింట్ కిల్డాలో వివసిస్తున్న చివరి 36 మంది ఆ ప్రదేశాన్ని ఖాళీ చేసి, స్కాట్లాండులోని ఇతర ప్రదేశాలకు తరలిపోయారు.
1944: స్లొవేకియాలోని స్లొవాక్ దళాలు 60, 000 మంది నాజీలకు వ్యతిరేంగా ఉద్యమింఛటంతో స్లొవాక్ లో జాతీయతా భావం ఉప్పొంగింది. ఆనాటినుంచి, 29 ఆగస్టుని జాతీయతా భావం ఉప్పొంగిన దినంగా జరుపుకుంటున్నారు స్లొవేకియా లో.
1949: సోవియట్ యూనియన్ తన మొట్ట మొదటి అణుబాంబును (పేరు: ఫస్ట్ లైట్నింగ్ (లేక) జోయ్ 1) కజకిస్తాన్ లోని సెమిపలతిస్స్క్ అనే చోట పరీక్షించింది.
1957: స్ట్రామ్ థర్మాండ్, అమెరికన్ సెనేట్ లో 24 గంటలకు పైగా సివిల్ రైట్స్ బిల్లు పై వ్యతిరేకంగా మాట్లాడి రికార్డు సృష్టించాడు. ఆ బిల్లు పాస్ అయ్యింది.
1958: యునైటెడ్ స్టేట్స్ఏయిర్ ఫోర్స్ అకాడెమీని, కొలరాడో లోని కొలరాడొ స్ప్రింగ్స్ అనే చోట ప్రారంభించారు.
1965: అమెరికన్ రోదసి నౌక జెమిని-5 భూమికి తిరిగి వచ్చింది
1966: బీటిల్స్ (గాయకుల బృందం] తమ చివరి కచేరిని అమెరికాలోని, సాన్ఫ్రాన్సిస్కో లోని కేండిల్స్టిక్ పార్క్ దగ్గర చేసారు.
1982: కృత్రిమంగా తయారుచేసిన రసాయన మూల్లకం మీట్నెరియం (అటామిక్ నెంబరు 109) ని మొట్టమొదటిసారిగా జర్మనీ లోని, డార్మ్స్టాడ్ దగ్గర గెసెల్స్చాఫ్హ్ట్ ఫర్ స్చెరిఒనెన్ఫొర్స్కంగ్
1986: బ్రిటన్ లోని కవలలు తమ 100వ పుట్టిన రోజు జరుపుకున్నారు. 70 కోట్లమందిలో ఒక్కరికే ఇటువంటి అవకాశం ఉంటుంది. వీడియో చూడటానికి ఇక్కడ నొక్కు
1991: సుప్రీం సోవియెట్ (రష్యా పార్లమెంటు) కమ్యూనిస్ట్ పార్టీ కార్యక్రమాలను ఆపి వేసి, కమ్యూనిస్ట్ పార్టీకి చరమ గీతం పాడింది.
2005: హరికేన్ కత్రినా అమెరికాలోని గల్ఫ్ తీరాన్ని తాకి, మిసిసిపి, లూసియానా ల లోని సముద్ర తీర పట్టణాలను నాశనంచేసి 10లక్షల మందిని నిరాశ్రయులను చేసి, 1, 000 మంది మరణానికి కారణమయ్యింది.