1690: జర్మనీలోని న్యూరెంబర్గ్‌కు చెందిన జాన్ సి. డెన్నర్ 'క్లారినెట్' వాద్యాన్ని రూపొందించారు.
1760: ఫ్రెంచి వారి అధీనంలో ఉన్న పాండిచ్చేరినిబ్రిటిష్ కెప్టెన్ ఐరీకూట్ (Sir Eyre Coote) స్వాధీనం చేసుకున్నాడు.
1761: మరాఠాలూ అఫ్గాన్ల మధ్య మూడో పానిపట్టు యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో అహ్మద్‌షా అబ్దాలీ సేన విజయం సాధించింది.
1892: 'గ్రాండ్ ఓల్డ్‌మ్యాన్ ఆఫ్ ఇండియన్ క్రికెట్'గా పేరొందిన దినకర్ బల్వంత్ దేవధర్ జననం. ఆయన పేరు మీదే దేవధర్ ట్రోఫీ నిర్వహిస్తారు.
1964: ఇంగ్లండుతో జరిగిన ఓ టెస్టుమ్యాచ్‌లో భారత బౌలర్ బాపూ నాదకర్ణి వరుసగా 21 మెయిడెన్ ఓవర్లు విసిరి రికార్డు సృష్టించాడు. వికెట్లేమీ తీసుకోకున్నా ఆ మ్యాచ్‌లో అతను 32 ఓవర్లు వేసి ఐదు పరుగులు మాత్రమే ఇచ్చాడు.
1987: దూరదర్శన్ తెలుగు ప్రసారాలు పూర్తిస్థాయిలో హైదరాబాదు నుంచే ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలోని 16 ప్రాంతాలలో ఉన్న ట్రాన్స్మిటర్లను ఉపగ్రహ సాంకేతిక పరిజ్ఞానం సహకారంతో హైదరాబాద్ దూరదర్శన్ కేంద్రానికి అనుసంధానించారు. అంతకు ముందు ఢిల్లీ నుంచి ప్రసారమయ్యే హిందీ కార్యక్రమాలనూ హైదరాబాద్ కేంద్రం నుంచి రోజులో కొద్దిసేపు మాత్రమే ప్రసారమయ్యే తెలుగు ప్రసారాలనే ప్రేక్షకులు చూసేవారు.
2005: భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బి.ఎస్.ఎన్.ఎల్) బెంగళురు, చెన్నై, హైదరాబాద్, కోల్‌కత లలో బ్రాడ్‌బాండ్ సేవలను మొదలు పెట్టింది. మరొక 198 నగరాలకు ఈ సేవలను విస్తరిస్తామని ప్రకటించింది.
1856: న్యాపతి సుబ్బారావు, స్వాతంత్ర్య సమరయోధుడు, సంస్కరణవాది, సాహిత్యవేత్త, పాత్రికేయుడు. (మ. 1941]
1888: ముత్తరాజు సుబ్బారావు , నాటక రచయిత, శ్రీకృష్ణతులాభారం , పద్యాలు, ప్రసిద్ది(మ.1922).
1977: నారాయణ్ కార్తికేయన్, భారతదేశానికి చెందిన మొదటి ఫార్ములా వన్ మోటార్ రేసింగ్ డ్రైవరు.
1977: నిమిషా వేదాంతి, భూగర్భ చమురు నిల్వలపై పరిశోధన చేసిన శాస్త్రజ్ఞురాలు.
1990 :మణి రవి వాల్మీకి, వాల్మీకి బోయ ఎస్టీ సాధన ఉద్యమకారుడు, ఉమ్మడి అనంతపురం జిల్లా వాల్మీకి బోయ సంఘం అధ్యక్షుడిగా పనిచేశాడు, తెలుగుదేశం పార్టీ వాల్మీకి బోయ సాధికార కమిటీ స్టేట్ డైరెక్టర్
1980: ముదిగొండ లింగమూర్తి, పాత తరానికి చెందిన నటుడు. హాస్యం, క్రౌర్యం, శోకం లాంటి అన్ని పాత్రలలో రాణించిన అద్భుతమైన సహాయ నటుడు.
2016: మౌలానా అబ్దుల్ రహీం ఖురేషీ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు నాయకుడు. రాముడు అయోధ్యలో కాదు, పాకిస్థాన్‌లో పుట్టినట్లుగా ఉర్దూలో పుస్తకం రాసి సంచలనం సృష్టించాడు. (జ.1935)